తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​ఆర్​సీ అత్యవసరం-భవిష్యత్తుకు ఆధారం: సీజేఐ

అసోం జాతీయ పౌర రిజిస్టర్​(ఎన్​ఆరీసీ)ను సమర్థించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయ్​. అక్రమ వలస దారుల సంఖ్యపై గతంలో అనుసరించిన విధానాలే హింస చేలరేగడానికి కారణమన్నారు.

ఎన్ఆర్సీ అత్యవసరం-భవిష్యత్తుకు ఆధారం: సీజేఐ

By

Published : Nov 3, 2019, 10:20 PM IST

అసోంలో జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్​ఆర్​సీ)పై అనుసరిస్తున్న విధానాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగొయ్ సమర్థించారు. ఇది భవిష్యత్‌లో ఆధార పత్రంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్​ఆర్​సీ ఎంతో ఆవశ్యకమైనదిగా పేర్కొన్నారు.

ప్రముఖ జర్నలిస్ట్ మృణాల్ తాలూక్దార్ రచించిన 'పోస్ట్ కలోనియల్ అసోం' పుస్తకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న జస్టిస్‌ గొగొయ్.. అక్రమ వలసదారుల సంఖ్యపై గతంలో అనుసరించిన విధానం వల్లే హింస చెలరేగిందని అభిప్రాయపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు ఎన్​ఆర్​సీపై బాధ్యతా రహితమైన వార్తలు ప్రచురిస్తూ అసోం పరిస్థితులను మరింత దిగజారుస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుత ఎన్​ఆర్​సీ 1951 నాటి జాతీయ పౌరసత్వ జాబితాకు కొత్తరూపుగా అభివర్ణించారు జస్టిస్​ గొగొయ్​.

ఇదీ చూడండి: ఎన్సీపీ నేతకు శివసేన సందేశం..మద్దతు కోసమా?

ABOUT THE AUTHOR

...view details