తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా రోగులను దుప్పట్లో మోసుకెళ్లిన సిబ్బంది! - కరోనా వైరస్

మహారాష్ట్ర నాసిక్​లోని ఓ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం చూసి జనాలు అవాక్కవుతున్నారు. ఆసుపత్రిలో లిఫ్ట్​ పనిచేయడం లేదని కరోనా రోగులను ఓ దుప్పటిలో పట్టుకొని మెట్లపై నుంచి మోసుకెళ్లారు.

civil hospital lift problem
లిఫ్ట్​​ ఆగిపోయింది.. కరోనా రోగులకు సంచే దిక్కయింది!

By

Published : May 29, 2020, 7:52 PM IST

"అసలే కరోనా వచ్చింది... ఆసుపత్రికి వస్తే కనికరం లేకుండా ఓ మూటగట్టి వార్డ్​కు మోసుకెళ్తున్నారు. ఇదేం చిత్రం బాబూ!"... ఇదీ మహారాష్ట్ర నాసిక్​ జిల్లా ఆసుపత్రిలో కరోనా రోగి ఆవేదన. ఆసుపత్రిలో లిఫ్ట్​ సరిగా పనిచేయడం లేదని కరోనా రోగులను ఇలా ఓ మూటగట్టి దుప్పటిలో మోసుకొని మెట్లపై నుంచి వార్డుకు తీసుకువెళ్తున్నారు సిబ్బంది. ఈ విషయంపై ఆసుపత్రి వైద్యుడు డా. నీలేశ్ జెజుకర్​ను 'ఈటీవీ భారత్' సంప్రదించగా కొద్ది రోజులుగా ఎలివేటర్​ సమస్య ఉందని, వెంటనే పరిష్కరిస్తామని బదులిచ్చారు.

కరోనా కేసుల్లో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి ఆసుపత్రులకు రోజూ వందల కేసులు వస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు లేకపోవడం గమనార్హం.

లిఫ్ట్​​ ఆగిపోయింది.. కరోనా రోగులకు సంచే దిక్కయింది!
లిఫ్ట్​​ ఆగిపోయింది.. కరోనా రోగులకు సంచే దిక్కయింది!
లిఫ్ట్​​ ఆగిపోయింది.. కరోనా రోగులకు సంచే దిక్కయింది!
లిఫ్ట్​​ ఆగిపోయింది.. కరోనా రోగులకు సంచే దిక్కయింది!
లిఫ్ట్​​ ఆగిపోయింది.. కరోనా రోగులకు సంచే దిక్కయింది!

ABOUT THE AUTHOR

...view details