తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇరాన్​ గగనతలం మీదుగా ప్రయాణం వద్దు'

అమెరికా- ఇరాన్​ల మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ... భారత విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రత్యామ్యాయ మార్గంలో విమానాలు ప్రయాణించేలా చర్చించి డీజీసీఏకు తెలిపాయి.

'ఇరాన్​ గగనతలం మీదుగా ప్రయాణం వద్దు'

By

Published : Jun 22, 2019, 6:24 PM IST

అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణించకూడదని భారత విమానయాన సంస్థలు నిర్ణయించినట్లు పౌర విమానయాన సంస్థ డీజీసీఏ తెలిపింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గంలో విమానాలు ప్రయాణించేలా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

అమెరికాకు చెందిన డ్రోన్‌ను ఇరాన్‌ కూల్చివేయడం వల్ల టెహ్రాన్​ ప్రాంతం మీదుగా తమ విమానాలు వెళ్లకుండా అమెరికా ఇప్పటికే ఆ దేశ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌కూ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.

శుక్రవారం మరికొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు అగ్రరాజ్యం బాటలో పయనించాయి. తాజాగా భారత విమానయాన సంస్థలూ డీజీసీఏతో సంప్రదింపులు జరిపాయి. ప్రభావిత ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణించకూడదని నిర్ణయం తీసుకున్నాయి.

ఇదీ చూడండి: 'పిలాటస్​' ఒప్పందంలో అవినీతిపై సీబీఐ కేసు

ABOUT THE AUTHOR

...view details