అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈస్టర్ పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు అనుమతివ్వాలని దిల్లీ కోర్టును అభ్యర్థించారు.
"గతేడాది క్రిస్మస్ సమయంలో నన్ను అదుపులోకి తీసుకున్నారు. పండగ రోజూ నన్ను విచారించారు. ఒక క్రైస్తవుడిగా ప్రార్థనలకూ అనుమతించలేదు. ఈ నెల 21న ఈస్టర్ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతాయి. ఆ రోజైనా నా కుటుంబంతో కలిసి పండుగ చేసుకునేందుకు అనుమతించండి."
-క్రిస్టియన్ మిషెల్ పిటిషన్ సారాంశం