తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీబీఐ అరెస్ట్​ చేస్తామంటోంది... ఏమంటారు?'

శారదా చిట్​ఫండ్​ కుంభకోణం కేసులో మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ). ఈ స్కామ్​లో భాగస్వాములైన వారందరూ పట్టుబడాలంటే కోల్​కతా కమిషనర్​ రాజీవ్​ కుమార్​ను అరెస్ట్​ చేయాలని కోరింది. సీబీఐ పిటిషన్​పై రాజీవ్ కుమార్​ 4 వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది సుప్రీం.

శారదా చిట్​ఫండ్​ కుంభకోణం కేసు

By

Published : Apr 8, 2019, 5:03 PM IST

Updated : Apr 8, 2019, 7:06 PM IST

శారదా చిట్​ఫండ్​ కుంభకోణం

శారదా చిట్​ఫండ్​ కుంభకోణం కేసులో మరోమారు సుప్రీంను ఆశ్రయించింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఈ స్కామ్​లో భాగస్వాములైన వారందరూ పట్టుబడాలంటే కోల్​కతా కమిషనర్ రాజీవ్​ కుమార్​ను అరెస్ట్​ చేయాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. సీబీఐ అభ్యర్థనపై రాజీవ్​ కుమార్​ 4 వారాల్లోగా స్పందించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి రంజన్​ గొగోయి​ నేతృత్వంలోని ధర్మాసనం రాజీవ్​ కుమార్​కు నోటీసులు జారీ చేసింది.

"రోజ్​ వ్యాలీ పోంజీ, శారదా కుంభకోణాలకు పాల్పడ్డ వారందరినీ కనిపెట్టాలంటే... రాజీవ్​ కుమార్​ను అరెస్ట్​ చేయకుండా ఫిబ్రవరి 5న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పునః పరిశీలించాల్సిన అవసరముంది. పశ్చిమ్​ బంగ రాష్ట్రాధికారులు దర్యాప్తునకు ఎలాంటి అడ్డంకి సృష్టించకుండా, సీబీఐ అధికారులను బెదిరించకుండా కోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకునేలా ఆదేశాలివ్వండి."
-సీబీఐ

Last Updated : Apr 8, 2019, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details