తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్యాంగాంగ్​ నుంచి వెనక్కు తగ్గిన చైనా బలగాలు!

సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో ప్యాంగాంగ్​ సరస్సు నుంచి చైనా బలగాలు వెనక్కితగ్గాయని భారత సైనిక వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన అంగీకారం ప్రకారం.. ఫింగర్​ 4 నుంచి తన బలగాలను చైనా ఉపసంహరించుకుందని స్పష్ట చేశాయి.

SINOINDIA-LADAKH
ప్యాంగాంగ్

By

Published : Jul 12, 2020, 5:35 AM IST

తూర్పు లద్దాఖ్​ సరిహద్దుల్లో చైనా తన ప్రాబల్యాన్ని క్రమంగా తగ్గిస్తోంది. తాజాగా ఫింగర్​- 4 ప్రాంతం నుంచి తన బలగాలను వెనక్కు పంపినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ప్యాంగాంగ్​ సరస్సులోనూ కొన్ని పడవలను తొలగించినట్లు స్పష్టం చేశాయి. భారత్​తో మరో దఫా లెఫ్టినెంట్ జనరల్​ స్థాయి చర్చలు జరగనున్న నేపథ్యంలో చైనా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

గల్వాన్​ లోయలో హింసాత్మక ఘటనల తర్వాత రెండు దేశాలు బలగాల ఉపసంహరణకు నిర్ణయించాయి. భారత్​, చైనా మధ్య జరిగిన దౌత్య, సైనిక చర్చల్లో భాగంగా ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణలో భాగంగా సోమవారం నుంచి రెండు దేశాలు కీలక ప్రాంతాల్లో ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించాయి.

భారత్​ ఒత్తిడితో..

మొదటి దశలో గల్వాన్​ లోయ, గోగ్రా, హాట్​స్ప్రింగ్స్​లో బలగాల ఉపసంహరణ ఇప్పటికే పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్యాంగాంగ్​ సరస్సు ప్రాంతంపై భారత్​ దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో ఫింగర్​ 4 నుంచి 8 వరకు బలగాలను వెనక్కి పిలువాల్సిందేనన్న భారత్​ ఒత్తిడికి చైనా తలొగ్గింది.

శాంతి పునరుద్ధరణకు అంగీకారం..

భారత్​ చైనా మధ్య శుక్రవారం జరిగిన దౌత్య స్థాయిలో చర్చల్లో పూర్తిగా బలగాల ఉపసంహరణకు రెండు దేశాలు అంగీకరించాయి. ఆన్​లైన్​ ద్వారా నిర్వహించిన ఈ భేటీలో భారత్​ తరఫున ఎంఈఏ తూర్పు ఆసియా సంయుక్త కార్యదర్శి, చైనా నుంచి సరిహద్దు, సముద్రాల శాఖ డైరెక్టర్​ జనరల్​ పాల్గొన్నారు.

"ఈ భేటీలో బలగాల ఉపసంహరణ ప్రక్రియ పురోగతిపై చర్చించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు, నిబంధనలకు అనుగుణంగా బలగాలను పూర్తి స్థాయిలో వెనక్కి పిలవాలని ఈ భేటీలో ఇరు పక్షాలు అంగీకరించాయి. సరిహద్దుల్లో శాంతి, సామరస్యం పునఃస్థాపనకు కృషి చేయాలని నిర్ణయించాయి."

- భారత విదేశాంగ శాఖ ప్రకటన

ఇదీ చూడండి:'గల్వాన్​పై చైనా పాట కొత్తేం కాదు- జోరు పెంచింది అంతే'

ABOUT THE AUTHOR

...view details