తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అక్కడ చైనా వచ్చింది.. ఇక్కడ మోదీ అదృశ్యమయ్యారు'

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ విమర్శలు చేశారు. భారత భూభాగంలోకి చైనా ప్రవేశించిందని.. కానీ సమాధానం చెప్పాల్సిన ప్రధాని అదృశ్యమయ్యారని ట్వీట్​ చేశారు.

Chinese have walked in and taken our territory, PM has vanished: Rahul
'అక్కడ చైనా వచ్చింది.. ఇక్కడ మోదీజీ అదృశ్యమయ్యారు'

By

Published : Jun 10, 2020, 11:10 AM IST

చైనాతో సరిహద్దు వివాదంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. ఈ విషయంపై ఇటీవలే రక్షణమంత్రి రాజ్​నాథ్​పైవ్యంగ్యాస్త్రాలు సంధించిన రాహుల్​.. తాజాగా ప్రధానమంత్రి మోదీపై తన బాణాలను ఎక్కుపెట్టారు. లద్దాక్​​లోని భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని.. దీనిపై సమాధానమివ్వాల్సిన మోదీ అదృశ్యమయ్యారని ఎద్దేవా చేస్తూ ట్వీట్​ చేశారు.

"లద్దాక్​​లోని మన భూభాగాన్ని చైనీయులు ఆక్రమించుకున్నారు. ఈ విషయంపై ప్రధాని నిశ్శబ్దంగా ఉన్నారు. మోదీ అదృశ్యమయ్యారు."

--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

తన వ్యాఖ్యలకు బలం చేకూరేలా.. ఓ వార్తా కథనాన్ని ట్వీట్​కు జత చేశారు రాహుల్​.

మే 5న పాంగ్యాంగ్​ ట్సో ప్రాంతంలో భారత్​-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దు వెంబడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే సమస్యను పరిష్కరించడానికి ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details