తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాస్తవాధీన రేఖ వెంట చైనా హెలికాఫ్టర్ల చక్కర్లు! - వాస్తవాధీన రేఖ

లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వద్ద.. చైనా సైనిక చాపర్లు చక్కర్లు కొట్టాయి. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం.. సుఖోయ్​-30ఎమ్​కేఐను రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలో సరిహద్దు వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే చైనా చాపర్లు భారత భూభాగంలోకి ప్రవేశించలేదని అధికారులు స్పష్టం చేశారు.

Chinese choppers spotted near Ladakh LAC prompt alert, IAF fighters rushed in
భారత సరిహద్దు వెంబడి చైనా హెలికాఫ్టర్ల చక్కర్లు!

By

Published : May 12, 2020, 12:15 PM IST

ఉత్తర సిక్కిం ప్రాంతంలో.. భారత్‌, చైనా బలగాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఇరుదేశాల సైనికులు గాయపడిన తర్వాత పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే ఉంది. ఈ నేపథ్యంలో చైనా బలగాలు.. భారత్‌ దిశగా దుందుడుకు వైఖరిని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈసారి లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద.. చైనా సైనిక చాపర్లు చక్కర్లు కొడుతూ కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు.. యుద్ధవిమానాలను రంగంలోకి దించాయి.

అయితే చైనా సైనిక హెలికాఫ్టర్లు వాస్తవాధీన రేఖను మాత్రం దాటలేదని, రేఖకు దగ్గరగా చక్కర్లు కొట్టాయని ప్రభుత్వాధికారి ఒకరు స్పష్టంచేశారు. ముందుజాగ్రత్తగా భారత వైమానిక దళం లేహ్‌లోని తమ స్థావరం సుఖోయ్‌-30ఎమ్​కేఐ యుద్ధవిమానాలను రంగంలోకి దించినట్లు వివరించారు.

హంద్వారా తీవ్రవాదుల దాడి తర్వాత మరోసారి భారత్ మెరుపు దాడులు చేస్తుందనే భయంతో పాకిస్థాన్‌ ఇటీవల భారత్‌తో సరిహద్దుల వెంబడి.. తమ యుద్ధ విమానాలతో పెట్రోలింగ్ ముమ్మరం చేసింది. ఇదే సమయంలో చైనా సైనిక చాపర్లు.. చక్కర్లు కొట్టడం వల్ల భారత వాయుసేన అప్రమత్తమైంది. గతంలోనూ... లద్దాఖ్ ప్రాంతంలోకి చైనా సైనిక హెలికాఫ్టర్లు సరిహద్దులు దాటి చొచ్చుకొచ్చిన ఘటనలు ఉన్నప్పటికీ.. తర్వాత వెనుదిరిగి వెళ్లిపోయాయి.

కోవిడ్‌-19 వ్యాప్తికి అసలు కారణం చెప్పాలని.. ఇటీవల అమెరికా సహా అనేక దేశాలు చైనాపై ఒత్తిడి పెంచాయి. ఇదే కారణంతో.. అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన బహుళ జాతీయ కంపెనీలు పెట్టుబడులకు.. చైనాకు బదులుగా భారత్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకునే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నాయి. ఈ అక్కసుతోనే భారత్‌ సరిహద్దుల వెంట.. చైనా దుందుడుకు చర్యలు చేపడుతోందని భద్రతా బలగాలు ఆనుమానిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details