తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితిపై చర్చించేందుకు చైనా అధ్యయన బృందం (సీఎస్జీ) జులై 28న సమావేశమైంది. ఫింగర్ ఏరియా నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు చైనా ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని భేటీలో చర్చించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయ్శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, సైన్యాధికారులు, ప్రభుత్వ సంస్థలకు చెందిన ఇతర అధికారులు సీఎస్‌జీలో సభ్యులుగా ఉన్నారు.
గత చర్చల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం తూర్పులద్దాఖ్‌లోని అన్ని ప్రాంతాల నుంచి చైనా తన బలగాలను కచ్చితంగా ఉపసంహరించుకోవాల్సిందేనని సీఎస్జీ భేటీలో నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.