సరిహద్దు ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న తరుణంలో చైనా తన వక్రబుద్ధిని మరోమారు బయటపెట్టింది. తూర్పు లద్ధాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో దాదాపు 40,000మంది బలగాలను మోహరించింది.
మరోవైపు భారత్తో ఇప్పటివరకు జరిగిన మిలిటరీ, దౌత్య స్థాయి చర్చల్లో కుదిరిన ఒప్పందాలను కూడా చైనా లెక్కచేయడం లేదు. సమస్యాత్మక ప్రాంతాల నుంచి తన బలగాలను చైనా ఉపసంహరించుకోకపోవడమే ఇందుకు కారణమని భారత సైన్యానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు.
"సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అదే సమయంలో తూర్పు లద్ధాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న లోతైన ప్రాంతాల్లో దాదాపు 40వేల బలగాలను మోహరించింది. ఈ బలగాలకు భారీ స్థాయిలో అయుధాలు సమకూర్చింది."
---- భారత సైన్యాధికారి.
ఇదీ చూడండి:-చైనా కొత్త కుట్ర- అక్కడి నుంచి వెనక్కి వెళ్లేందుకు నో!
గత వారం భారత్-చైనా మధ్య కార్ప్ కమాండర్ల స్థాయిలో జరిగిన భేటీ అనంతరం.. బలగాల ఉపసంహరణ ప్రక్రియ ముందుకు కదలలేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలాగే ఉన్నట్టు సైనిక అధికారి వెల్లడించారు.