మూడేళ్ల కిందట డోక్లామ్ ప్రాంతంలో భారత్‌తో సైనిక ప్రతిష్టంభన ఏర్పడినప్పటి నుంచి వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి చైనా తన వైమానిక స్థావరాలను, గగనతల రక్షణ వ్యవస్థలను, హెలిపోర్టులను రెట్టింపు చేసింది. నాటి వివాదం తర్వాత కనీసం 13 కొత్త సైనిక శిబిరాలు, మూడు వైమానిక క్షేత్రాలు, ఐదు శాశ్వత గగనతల రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసిందని అంతర్జాతీయ భద్రతా కన్సల్టెన్సీ ‘స్ట్రాట్‌ఫర్’ పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో తూర్పు లద్దాఖ్‌లో రెండు దేశాల మధ్య ఘర్షణ మొదలయ్యాకే నాలుగు హెలిపోర్టుల నిర్మాణం మొదలైందని వివరించింది. డోక్లామ్ వివాదం తర్వాత చైనా వ్యూహాత్మక లక్ష్యాల్లో మార్పులు కనిపించాయని తెలిపింది.
'డోక్లామ్' తర్వాత చైనా స్థావరాలు రెట్టింపు! - చైనా స్థావరాలు
డోక్లామ్ ఘటన తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక శిబిరాలను చైనా రెట్టింపు చేసుకుందని అంతర్జాతీయ భద్రతా కన్సల్టెన్సీ ‘స్ట్రాట్‌ఫర్’ పేర్కొంది. నాటి వివాదం తర్వాత కనీసం 13 కొత్త సైనిక శిబిరాలు, మూడు వైమానిక క్షేత్రాలు, ఐదు శాశ్వత గగనతల రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసిందని తెలిపింది.
‘డోక్లామ్’ తర్వాత చైనా స్థావరాలు రెట్టింపు!
డ్రాగన్ నిర్మాణాల కారణంగా భవిష్యత్‌లో భారత్‌తో సుదీర్ఘ ప్రాంతీయ ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉందని ‘స్ట్రాట్‌ఫర్’ వివరించింది. ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధవిమానాలను కొనుగోలు చేయడం వల్ల భారత్‌కు కొంత ఊరట లభించిందని, అయితే స్వదేశీ ఆయుధ ఉత్పత్తి, విదేశాల నుంచి కొనుగోలు ద్వారా భారత వాయుసేన సామర్థ్యం పూర్తిస్థాయిలో బలోపేతం కావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని స్ట్రాట్‌ఫర్ తెలిపింది.
Last Updated : Sep 23, 2020, 8:55 AM IST