రాజస్థాన్‌లో అనేక రోజులు కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. రాజస్థాన్ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి తొలుత సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. అధికార, విపక్షాల మధ్య వాడీవేడిగా చర్చలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం డబ్బు, అధికారం ఉపయోగించి మధ్యప్రదేశ్, మణిపూర్ ,గోవాలో ప్రభుత్వాలను పడగొట్టిందన్న మంత్రి.. అదే మంత్రాన్ని రాజస్థాన్‌లో ప్రయోగించగా బెడిసికొట్టిందని విమర్శలు గుప్పించారు.
విశ్వాస పరీక్షలో నెగ్గిన గహ్లోత్ సర్కార్ - నెగ్గిన గహ్లెత్
16:40 August 14
విశ్వాస పరీక్షలో నెగ్గిన గహ్లోత్ సర్కార్
గహ్లోత్ నేతృత్వంలోని సర్కార్‌ను కూలదోసేందుకు కేంద్రం ప్రయత్నించి విఫలమైందని విమర్శించారు. అనంతరం నిర్వహించిన ఓటింగ్‌లో మూజువాణి ఓటుతో గహ్లోత్ సర్కార్ విజయం సాధించినట్టు స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీని ఆగస్టె 21వరకు వాయిదా వేశారు.
16:16 August 14
విశ్వాస పరీక్షలో నెగ్గిన గహ్లోత్ సర్కార్
విశ్వాస పరీక్షలో నెగ్గిన గహ్లోత్ సర్కార్ నెగ్గింది. మూజువాణి ఓటుతో విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఈనెల 21కి శాసనసభ వాయిదా పడింది.