కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి. చిదంబరం భూమికే బరువని విమర్శించారు.
జమ్ముకశ్మీర్లా తమిళనాడును కేంద్రపాలిత ప్రాంతంగా మారిస్తే అధికార ఏఐఏడీఎంకే వ్యతిరేకించదన్న చిదంబరం వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు పళనిస్వామి. చిదంబరానికి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని... దేశ ప్రయోజనాలు పట్టవని ఆరోపించారు. కేంద్రమంత్రిగా ఉన్న కాలంలో కావేరి జలవివాదం సహా రాష్ట్రానికి చిదంబరం చేసిందేమీ లేదని మండిపడ్డారు పళనిస్వామి.
"ఆయన ఎంతో కాలం కేంద్రమంత్రిగా ఉన్నారు. తన పదవీకాలంలో తమిళనాడుకు ఆయన ఏమి తీసుకువచ్చారు? దేశానికి ఏమి ఉపయోగపడ్డారు? ఆయన భూమికే భారం."