తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రశ్నార్థకంగా కాంగ్రెస్​ ఉనికి: చిదంబరం - చిదంబరం కాంగ్రెస్​ పార్టీ

కాంగ్రెస్​ సంస్థాగత ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని ఆ పార్టీ సీనియర్​ నేత పి.చిదంబరం అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ పనితీరు ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. సొంత పార్టీ నేతలు కాంగ్రెస్​పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చిదంబరం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Chidambaram expresses disappointment over Congress's performance
ప్రశ్నార్థకంగా కాంగ్రెస్​ ఉనికి: చిదంబరం

By

Published : Nov 19, 2020, 6:31 AM IST

కాంగ్రెస్‌ అధిష్ఠానంపై సీనియర్లు ఒక్కొక్కరుగా పెదవి విరుస్తున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కాంగ్రెస్ పార్టీ ఉనికిని ప్రశ్నించారు. అట్టడుగు స్థాయిలో ఆ పార్టీ సంస్థాగత ఉనికి, పార్టీ గణనీయంగా బలహీన పడుతున్న అంశాలను బిహార్‌, ఇతర రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు రుజువు చేశాయని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ను ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించడం లేదంటూ కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు చేసిన కొద్ది సమయంలోనే చిదంబరం ఇలా మాట్లాడటం గమనార్హం. మామూలుగా పార్టీపై వచ్చే విమర్శలకు ఆయన దీటుగా బదులిస్తుంటారు. కానీ, ప్రస్తుత స్పందన దానికి భిన్నంగా ఉంది.

'గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ ప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ఫలితాలు నన్ను మరింత ఆందోళనలోకి నెట్టేశాయి. పార్టీ సంస్థాగత ఉనికి, గణనీయంగా బలహీన పడుతున్న విషయాన్ని ఆ ఫలితాలు వెల్లడి చేస్తున్నాయి. బిహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్‌కు గెలిచే అవకాశం ఉంది. విజయానికి దగ్గరగా ఉండీ ఎందుకు ఓడిపోయామనే అంశంపై సమీక్ష అవసరం. గుర్తుంచుకోండి.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ విజయం సాధించి ఎంతో కాలం కాలేదు. ఏఐఎంఐఎం, సీపీఐ-ఎంఎల్ వంటి చిన్న పార్టీలు సైతం బిహార్ ఎన్నికల్లో గొప్ప పనితీరును ప్రదర్శించాయి. తాజా ఎన్నికల ఫలితాలు సంస్థాగత స్థాయిలో కాంగ్రెస్ బలోపేతం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నాయి' అని చిదంబరం సూటిగా మాట్లాడారు.

మహాగట్‌ బంధన్‌లో కాంగ్రెస్ ఆశించనమేరకు ప్రదర్శన చూపలేదనే విషయాన్ని అంగీకరిస్తూ.. తన బలానికి మించి కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిందని చిదంబరం అన్నారు. 'ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ నిరాకరించాలి. పార్టీ 45మంది అభ్యర్థులను మాత్రమే నిలబెట్టి ఉండాలి' అని అన్నారు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, బెంగాల్, అసోంలో ఎన్నికల గురించి ఆయన ప్రస్తావించారు. 'ఈ రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం' అని నిరాశగా మాట్లాడారు.

గాంధీయేతరులు పార్టీని నడిపించాలంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు గురించి ప్రశ్నించగా, చిదంబరం చాలా జాగ్రత్తగా సమాధానం ఇచ్చారు. 'ఆల్‌ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) సమావేశంలో అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారో నేను చెప్పలేను. అక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు' అని వెల్లడించారు.

బిహార్ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అలాగే యూపీ, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా దారుణ పరభావాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి:-అమిత్‌జీ.. మీది ఏ గ్యాంగ్‌ మరి?: సిబల్​

ABOUT THE AUTHOR

...view details