శివగంగలోని తన నివాసంపై ఐటీ దాడులు జరిపించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని కాంగ్రెస్ నేత చిదంబరం ఆరోపించారు. శివగంగ లోక్సభ నియోజకవర్గంలో తమ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడానికే భాజపా ఈ కుట్ర పన్నుతోందని ఆయన విమర్శించారు.
"ఐటీ శాఖ చెన్నై, శివగంగలోని నా నివాసాలపై దాడులు చేయడానికి యోచిస్తోంది. మేము ఆ శోధన బృందాన్ని ఆహ్వానిస్తున్నాము."
"ఐటీ శాఖకు తెలుసు మేము దాచడానికి ఏమీ లేదని. ఇంతకుముందు ఐటీతో పాటు ఇతర సంస్థల అధికారులూ మా నివాసాల్లో సోదాలు నిర్వహించారు. కానీ వారికి ఏమీ దొరకలేదు. ప్రస్తుత ఐటీ దాడుల యోచన వెనుక ఉన్న అసలు ఉద్దేశం, మా ఎన్నికల ప్రచారం అడ్డుకోవడమే."- చిదంబరం, కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థికమంత్రి