తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్యార్థిని సృష్టి.. అరటి నారతో శానిటరీ ప్యాడ్లు

ఛత్తీస్​గఢ్​ కోర్బాలోని ఓ పాఠశాల విద్యార్థిని అరటి నారతో శానిటరీ ప్యాడ్లు తయారు చేసింది. పలు అవార్డులను గెలుచుకుంది. ఆమె జపాన్​లో జరిగే విజ్ఞాన ప్రదర్శనకు ఎంపికైంది.

By

Published : Mar 24, 2019, 7:34 AM IST

ప్యాడ్​ తయారీ పరికరాలు

సానిటరీ ప్యాడ్​ను తయారు చేస్తున్న రీనా రాజ్​పుత్
ఛత్తీస్​గఢ్​ కోర్బాలో ఓ పాఠశాల విద్యార్థిని రీనా రాజ్​పుత్​ వినూత్నంగా ఆలోచించింది. నూతన ఆవిష్కరణ చేసింది. ఆ పని నలుగురికి ఉపయోగపడాలనుకుంది. అరటి నారతో శానిటరీ ప్యాడ్లు తయారు చేసి అందరి మన్ననలను పొందింది.

మహిళలు కొన్ని సందర్భాల్లో శుభ్రంగా ఉండటం ఎంతో అవసరం. అందుకు కావాల్సిన ఉత్పత్తులను కొనే స్తోమత అందరికీ ఉండకపోవచ్చు. దేశంలో 88 శాతం మహిళలు శానిటరీ ప్యాడ్లను వాడటంలేదు. 90 శాతానికి పైగా ప్యాడ్ల తయారీలో ప్లాస్టిక్​ను వినియోగిస్తున్నారు.

ఈ పరిస్థితిని మార్చేందుకు ఉపక్రమించింది కోర్బాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని రీనా రాజ్​పుత్. అరటినారతో ప్యాడ్లను తయారు చేసే ఓ పరికరాన్ని సృష్టించింది.

"అరటి నార ఎక్కువ నీటిని పీల్చుకుంటుంది. ఒకసారి నారను పిండితే నీళ్లు ఎక్కువగా వచ్చాయి. అరటి నారతో బట్టనూ తయారు చేయొచ్చని పత్రికలో చదివాను. నారతో ప్యాడ్​ తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. దాన్ని ఆచరణలో పెట్టి సాధించాను. అయితే ఇది కొద్దిగా దృఢంగా ఉండటం వల్ల విరిగిపోతుంది. మెత్తగా ఉండేందుకు కొద్దిగా నూలు కలిపి తయారు చేస్తున్నాను. "
-రీనా రాజ్​పుత్, విద్యార్థిని

ఈ ప్రయోగం చేసినందుకు గాను దిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన ఐఐటీ-జాతీయ విజ్ఞాన ప్రదర్శన 'మానక్' కార్యక్రమంలో 'స్ఫూర్తి' అవార్డు గెలుచుకుంది రీనా. జపాన్​లో జరగబోయే సకురా విజ్ఞాన ప్రదర్శనకు ఎంపికయింది రీనా.

అరటి నారే ఎందుకు?

అరటిలో ప్రత్యేకత ఉంది. ఒకసారి పండ్లను కాసిందంటే ఆ చెట్లను నరికేస్తారు. ఆ వ్యర్థాన్నంతా మనం వినియోగించుకోగలం. ఇది ఒక రకంగా ఖర్చు తక్కువ. హానికరమైన సమస్యలు తలెత్తవు. పూర్తిగా సహజమైనది.

ఇదీ చూడండి:ఖతార్​ రాజు మెచ్చిన కేరళ పనస పంట..!

ABOUT THE AUTHOR

...view details