తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సంక్షోభం: నీళ్లు లేవ్.. అతిథి గృహాల్లో గదుల్లేవ్​ - city

తమిళనాడులో నీటి కష్టాలు మరింత పెరిగాయి. వర్షాలు పడని కారణంగా.. నీరు లేక ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు వ్యాపారం, ఆర్థిక వ్యవస్థపైనా నీటి సంక్షోభం ప్రభావం చూపుతోంది. ఇటీవల హోటళ్లలో మధ్యాహ్న భోజనం రద్దు చేసిన నిర్వాహకులు.. తాజాగా హోటళ్లు, అతిథి గృహాల్లో గదులే లేవని బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

సంక్షోభం: నీళ్లు లేవ్.. అతిథి గృహాల్లో గదుల్లేవ్​

By

Published : Jun 18, 2019, 3:33 PM IST

Updated : Jun 18, 2019, 9:41 PM IST

సంక్షోభం: నీళ్లు లేవ్.. అతిథి గృహాల్లో గదుల్లేవ్​

రోజురోజుకూ నీటి ఎద్దడి విపరీతంగా పెరిగిపోతుంది. రుతుపవనాల ఆలస్యంతో పలు రాష్ట్రాలను వరుణుడు ఇంకా పలకరించనే లేదు. తమిళనాడులో అయితే మరీనూ. ఇక్కడి నీటి సంక్షోభం ఆర్థిక వ్యవస్థ, వ్యాపారాలపై ప్రభావం చూపిస్తోంది.

తమిళనాడు ట్రిప్లికేన్​ ప్రాంతంలో నీటికొరతతో విలాసవంతమైన హోటళ్లు, లాడ్జ్​లలో గదులే కరవయ్యాయి. అక్కడ బసచేయడానికి వెళుతున్న అతిథులు, పర్యటకులకు 'ఇక్కడ గదులు లేవు' అన్న బోర్డులే దర్శనమిస్తున్నాయి. కొన్ని అతిథి గృహాలు, మాన్షన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నారంటేనే నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది.

క్యాంటీన్లు బంద్​...

కొద్ది రోజులుగా తమిళనాడు ప్రజలు నీటి ఎద్డడితో విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం వాటర్​ ట్యాంకర్ల వద్ద బారులు తీరుతున్నారు. చెన్నై శివారులోని పలు ఐటీ సంస్థలు బహుళ ప్రయోజనాల కోసం తాగునీరు లేక క్యాంటీన్లను మూసివేస్తున్నాయి. ఇంటి నుంచే భోజనం, తాగు నీరు, వాడి పారేసే ప్లాస్టిక్​, పేపర్​ ప్లేట్లు తెచ్చుకోవాలని సూచిస్తున్నాయి.

ఇటీవల అన్నాసలై ప్రాంతంలోని ఆనంది హోటల్​ యాజమాన్యం.. నీరు లేక మధ్యాహ్న భోజనం పెట్టలేమని కస్టమర్లు సహకరించాలని కోరింది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. నీటి కోసం మండుటెండలో చేతిపంపుల వద్ద బారులు తీరుతున్నారు. తాగునీటి కొనుగోలు కోసం వందల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:సంక్షోభం: నీళ్లు లేవు... భోజనం పెట్టలేం..!

Last Updated : Jun 18, 2019, 9:41 PM IST

ABOUT THE AUTHOR

...view details