తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తెలంగాణ కబడ్డీ కోచ్​ తమిళనాడులో అరెస్ట్! - అరెస్ట్

చెన్నైలో తెలంగాణ ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. టోర్నమెంటుకు వెళ్లిన క్రీడాకారులు బస్సు కండక్టర్​తో జరిగిన గొడవ విషయంలో పోలీస్​ స్టేషన్​కు వెళ్లారు. ఒకరోజంతా ఠాణాలో ఉన్న తర్వాత ఇరుపక్షాలు ఫిర్యాదులు ఉపసంహరించుకున్నాయి.

తెలంగాణ కబడ్డీ కోచ్​ తమిళనాడులో అరెస్ట్!

By

Published : Sep 3, 2019, 4:49 PM IST

Updated : Sep 29, 2019, 7:34 AM IST

తెలంగాణ కబడ్డీ కోచ్​ తమిళనాడులో అరెస్ట్!
తెలంగాణ కబడ్డీ ఆటగాళ్లు తమిళనాడు రాజధాని చెన్నై పోలీస్​ స్టేషన్​లో బంధీలయ్యారు. బస్సులో కండక్టర్‌తో జరిగిన గొడవే ఇందుకు కారణం.

తెలంగాణలోని ఓ ప్రైవేటు కళాశాల నుంచి 59మంది కబడ్డీ ఆటగాళ్లు గత వారం పోటీల కోసం పుదుచ్చేరి వెళ్లారు. టోర్నమెంట్ ముగిసిన తర్వాత వారంతా చెన్నై చేరుకున్నారు. రెండు బృందాలుగా విడిపోయి రెండ్రోజులు నగరంలోని పర్యటక ప్రదేశాలను తిలకించాలనుకున్నారు. ఆదివారం మెరీనా బీచ్​కు వెళ్లేందుకు ఓ బృందం అన్నా సాలయి నుంచి పెరియార్​ నగర్​కు వెళ్లే బస్సు ఎక్కింది.

ఎగ్మోర్​ వద్ద బస్సు ఎక్కుతుండగా కోచ్ లక్ష్మణ్​... బస్సు కండక్టర్​ కాలు తొక్కాడని ప్రత్యక్ష సాక్షలు చెప్పారు. ఆ ఘటన ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఆటగాళ్లు కోచ్‌కు మద్దతుగా నిలిచి బస్సులో బీభత్సం సృష్టించారు. ఆగ్రహించిన ప్రయాణికులు కోచ్‌తో పాటు ఆటగాళ్లపై దాడికి పాల్పడ్డారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కండక్టర్​, కోచ్‌తో పాటు ఆటగాళ్లందరినీ స్టేషన్‌కు తరలించారు. ఒక రోజంతా అక్కడే ఉంచారు. సోమవారం ఇరుపక్షాల వారు ఫిర్యాదులు వెనక్కి తీసుకున్నారు.

ఇదీ చూడండి:యూపీ ఉప్పు-రొట్టె వీడియో తీసిన జర్నలిస్ట్​పై కేసు

Last Updated : Sep 29, 2019, 7:34 AM IST

ABOUT THE AUTHOR

...view details