తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గిరిపుత్రులతో కలిసి స్టెప్పులేసిన సీఎం..! - గిరిజనుల

గిరిజనులతో కలిసి ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి చిందులేశారు. ఆదివాసీల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సరదాగా పాల్గొన్నారు.

గిరిపుత్రులతో కలిసి స్టెప్పులేసిన సీఎం..!

By

Published : Aug 10, 2019, 1:07 PM IST

గిరిపుత్రులతో కలిసి స్టెప్పులేసిన సీఎం..!
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​ భగేల్​ శుక్రవారం చిందులేశారు. రాయ్​పుర్​ ఇండోర్​ స్టేడియంలో నిర్వహించిన సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొని గిరిజనులతో మమేకమయ్యారు​. వారు మోగించే డప్పు చప్పుళ్లకు కదం తొక్కారు. మేడలో డోలు వేసుకుని స్వయంగా తానే మోగిస్తూ గెంతులేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా తమను ఆనందపరిచినందుకు గిరిపుత్రులు మురిసిపోయారు.

ఛత్తీస్​గఢ్​లో ఆదివాసీల జనాభా అధికం. ఇప్పటివరకు ప్రకృతి వనరుల్ని వారే కాపాడుతూ వస్తున్నారు. అందుకే వారికి ఇక్కడి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details