తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ల్యాండర్​ పని 14 రోజులే.. ఆర్బిటర్​ది ఏడాది'

జాబిల్లిపై ల్యాండర్​ చేసే పనేంటి? 14 రోజులే ల్యాండర్​ పనిచేస్తుందా? తరువాత ఏం చేస్తుంది? ఆర్బిటర్​ ఏడాది కాలం పాటు ఏం పరిశోధనలు చేస్తుంది? వంటి ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు ఇస్రో శాస్త్రవేత్త డా. ఎమ్​ అన్నాదురై.

'ల్యాండర్​ పని 14 రోజులే.. ఆర్బిటర్​ది ఏడాది పాటు'

By

Published : Sep 5, 2019, 6:06 PM IST

Updated : Sep 29, 2019, 1:37 PM IST

జాబిల్లిపై దాగి ఉన్న ఎన్నో రహస్యాలను ఛేదించేందుకు భారత్​ ప్రయోగించిన బాహుబలి ప్రాజెక్ట్​ చంద్రయాన్​-2. అసలు చంద్రయాన్​-1 తరహాలో చంద్రయాన్​-2ని జాబిల్లిపైకి క్రాష్​ ల్యాండ్​ ఎందుకు చేయడం లేదు? సాఫ్ట్​ ల్యాండింగ్​కే​ ఎందుకు మొగ్గు చూపారు? ఈ ప్రశ్నలకు ఈటీవీ ముఖాముఖిలో జవాబులు చెప్పారు ఇస్రో శాస్త్రవేత్త, మంగళ్​యాన్​, చంద్రయాన్​-1కు ప్రోగ్రామ్​ డైరక్టర్​గా ఉన్న డా. అన్నాదురై.చంద్రయాన్-2 గురించి ప్రపంచానికి తెలియని మరిన్ని విశేషాలను వెల్లడించారు.

ఇస్రో శాస్త్రవేత్తతో ముఖాముఖి

ప్ర. ఆర్బిటర్ సంవత్సరం పాటు కక్ష్యలో ఉంటుంది. సంవత్సరం కాలం పాటు ఆర్బిటర్ కక్ష్యలో ఏం చేస్తుంది?

జ. సైన్స్​ కోణంలో ల్యాండర్​ కంటే ఆర్బిటర్​ నుంచే ఎక్కువ ఆశిస్తున్నాము. సాంకేతికంగా ల్యాండర్ చంద్రునిపై దిగి ఒక్క ప్రాంతంలోనే పరిశోధిస్తుంది. పూర్తిగా చంద్రుడ్ని ల్యాండర్ పరిశీలించలేదు. ఆర్బిటర్ సంవత్సరం కంటే ఎక్కువ కాలం పని చేస్తుందని నేను ఆశిస్తున్నాను. చంద్రయాన్-1 తో పోలిస్తే చంద్రయాన్-2లో చాలా వరకు మెరుగైన పరికరాలు ఉన్నాయి. దాదాపు అదే రకమైన పరికరాలు ఉపయోగించినప్పటికీ వాటి సామర్థ్యం చాలా వరకు పెరిగింది.

ప్ర. మన దేశ శాస్త్ర సాంకేతిక రంగం చంద్రయాన్-2 ల్యాండింగ్ పట్ల ఏ రకంగా చూస్తోంది?

జ: ప్రత్యేకంగా యువ శాస్త్రవేత్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. భవిష్యత్తులో చంద్రునిపై భారత్ ఉనికిని చాటి చెప్పడానికి ఈ ప్రయోగం దోహదం చేస్తుంది. చంద్రునిపై అవుట్​ పోస్టులు ఏర్పాటు చేసుకోవడానికి, చంద్రమండల అంతరిక్ష కేంద్ర ఏర్పాటుకు, పర్యటక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం సహా అనేక అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చంద్రయాన్-2 విజయంపై ఆధారపడి ఉన్నాయి.

Last Updated : Sep 29, 2019, 1:37 PM IST

ABOUT THE AUTHOR

...view details