తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరైన దిశలోనే చంద్రయాన్​-2 ప్రయాణం

చంద్రయాన్​-2 సరైన దిశలోనే సాగుతోందని ఇస్రో ప్రకటించింది. ఇప్పటివరకూ చేసిన ప్రయాణంలో ఓ చిన్న  మైలురాయిని అధిగమించినట్లు ఇస్రో తెలిపింది.

చంద్రయాన్​-2

By

Published : Jul 24, 2019, 7:36 AM IST

సరైన దిశలోనే చంద్రయాన్​-2 ప్రయాణం

జాబిల్లిని చేరుకోవటానికి భారత్​ ప్రయోగించిన ప్రతిష్టాత్మక చంద్రయాన్​-2 సరైన దిశలోనే వెళుతున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇప్పటివరకూ ఉపగ్రహం చేసిన ప్రయాణంలో ఓ చిన్న మైలురాయిని అధిగమించినట్లు పేర్కొంది. అయితే ఈ విజయాన్ని ఇప్పుడే వెల్లడించబోమని అధికారులు స్పష్టం చేశారు.

అంతరిక్ష వాహకనౌక 'జీఎస్​ఎల్వీ మార్క్‌-3ఎం1' ద్వారా శ్రీహరికోట నుంచి చంద్రయాన్​-2ను ప్రయోగించారు. ఇంతవరకు ఏ దేశం దిగని చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ఈ ఉపగ్రహం చేరుకుంటుంది. 48 రోజుల్లో 15 కీలక ప్రక్రియల అనంతరం సగటున 3 లక్షల 84 వేల కిలోమీటర్ల దూరం పయనించి సెప్టెంబర్​ 7న చంద్రుడిపై కాలుమోపనుంది చంద్రయాన్​-2.

3.8 టన్నుల బరువైన చంద్రయాన్‌-2ను ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌తో అనుసంధానం చేశారు. వీటిలో ఆర్బిటర్‌ చంద్రుడి చుట్టూ తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తుంది. ల్యాండర్‌ చంద్రుడిపై దిగుతుంది. ల్యాండర్‌పై ఉండే రోవర్‌ జాబిల్లి ఉపరితలంపై పరిశోధిస్తుంది. శిలలు, నీటి ఆనవాళ్లను పరిశీలిస్తుంది.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియాను ఆశ్చర్యపరిచిన చంద్రయాన్​-2..!

ABOUT THE AUTHOR

...view details