తెలంగాణ

telangana

ETV Bharat / bharat

3 రోజుల పాటు 'చంద్రయాన్​-2' చిత్రోత్సవాలు - birla

జాబిల్లిపై చంద్రయాన్​-2 ల్యాండింగ్​ సందర్భంగా కోల్​కతాలో బిర్లా ఇండస్ట్రియల్​, సాంకేతిక మ్యూజియం (బీఐటీఎం​) ఆధ్వర్యంలో చిత్రోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్​ 2 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్​ కొనసాగనుంది.

బిర్లా మ్యూజియం ఆధ్వర్యంలో 'చంద్రయాన్​-2' చిత్రోత్సవాలు

By

Published : Aug 31, 2019, 10:05 AM IST

Updated : Sep 28, 2019, 10:59 PM IST

బిర్లా మ్యూజియం ఆధ్వర్యంలో 'చంద్రయాన్​-2' చిత్రోత్సవాలు

సెప్టెంబర్​ 7న చంద్రయాన్​-2 చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా బిర్లా ఇండస్ట్రియల్​, సాంకేతిక మ్యూజియం (బీఐటీఎం​), నేషనల్​ జియోగ్రఫిక్​ సంయుక్త ఆధ్వర్యంలో అంతరిక్ష అంశంపై చిత్రోత్సవాన్ని​ నిర్వహిస్తున్నారు.

రోజుకు 2 సార్లు

కోల్​కతాలోని బీఐటీఎం మ్యూజియంలో సెప్టెంబర్​ 2 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్​ కొనసాగనుంది. ఇందులో మంగళ్​యాన్​, మిషన్ అపోలో​, మిషన్​ ప్లూటో, మిషన్​ సాటర్న్​ చిత్రాలు ప్రదర్శితమవుతాయని నేషనల్​ జియోగ్రఫిక్​​ సంస్థ తెలిపింది. ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండానే ఈ చిత్రాలను రోజులో రెండుసార్లు చూడొచ్చని పేర్కొంది.

జాబిల్లిపై చంద్రయాన్​-2 ల్యాండింగ్​ను వీక్షించేందుకు బీఐటీఎం​కు ప్రముఖ అంతరిక్ష సంస్థ నాసా మాజీ వ్యోమగామి జెరి లెనింగర్​ ముఖ్యఅతిథిగా హాజరవుతారని సంస్థ తెలిపింది.

ఇదీ చూడండి:నేడు ఎన్​ఆర్​సీ విడుదల... అసోంలో భయాందోళనలు!

Last Updated : Sep 28, 2019, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details