తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆన్​లైన్​ ద్వారా పౌరసత్వం.. ఓ విఫలయత్నం' - పౌరసత్వ చట్ట సవరణ

సీఏఏతో పౌరసత్వాన్ని అందించే ప్రక్రియను ఆన్​లైన్​ ద్వారా నిర్వహించాలన్న కేంద్ర ప్రణాళికను తృణముల్​ కాంగ్రెస్​ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆన్​లైన్​లో ఇది సాధ్యపడదని.. అమలు చేయడానికి ప్రయత్నిస్తే కేంద్రం పూర్తిగా విఫలమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇందుకు ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసనలే కారణమని తెలిపింది.

Centre's idea of granting citizenship under CAA online far   from reality: TMC
'ఆన్​లైన్​ ద్వారా పౌరసత్వం.. ఓ విఫల యత్నం'

By

Published : Jan 2, 2020, 5:20 AM IST

Updated : Jan 2, 2020, 2:43 PM IST

'ఆన్​లైన్​ ద్వారా పౌరసత్వం.. ఓ విఫలయత్నం'

పౌరసత్వ చట్ట సవరణను దేశంలోని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా బంగాల్​లో పౌర నిరసనలు విస్తృతంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ఆందోళనలు నిర్వహించి.. కేంద్రానికి గట్టి సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో పౌరసత్వాన్ని అందించే ప్రక్రియ మొత్తాన్ని ఆన్​లైన్​ ద్వారా నిర్వహించాలన్న కేంద్రం ప్రణాళికను తృణముల్​ కాంగ్రెస్ తీవ్రంగా​ వ్యతిరేకించింది. ఆన్​లైన్​ ప్రక్రియను అమలు చేస్తే కేంద్రం కచ్చితంగా విఫలమవుతుందని ఆ పార్టీ ఎంపీ సుదీప్​ బందోపధ్యాయ్​ పేర్కొన్నారు.

"కేంద్రం ఏదైనా చెప్పగలదు. కానీ వాస్తవాన్ని అర్థంచేసుకోవాలి. భారత్​లో పౌరసత్వాన్ని ఆన్​లైన్​ ద్వారా అందించడం, నమోదు చేసుకోవడం వంటివి పూర్తిగా విఫలమవుతాయి. ఈ ఆలోచన వాస్తవానికి ఎంతో దూరంలో ఉంది."
--- సుదీప్​ బందోపధ్యాయ్​, తృణముల్​ కాంగ్రెస్​ ఎంపీ.

సహజంగా జిల్లా మెజిస్ట్రేట్​ ఆధ్వర్యంలో ఈ పౌరసత్వ ప్రక్రియ జరుగుతుంది. పౌర నిరసనల కారణంగా ఈ విధానాన్ని నిలిపివేయాలని కేంద్రం యోచిస్తోంది.

ఆన్​లైన్ ద్వారా​ అయినా... ఆఫ్​లైన్​ అయినా కేంద్రం ఈ చట్టాన్ని అమలు చేయలేదని తృణముల్​ కాంగ్రెస్​ రాజ్యసభ ఎంపీ మానస్​ భునియా అభిప్రాయపడ్డారు.

"ఆన్​లైన్​, ఆఫ్​లైన్​.. ఏ రకంగానైనా దేశంలో సీఏఏని అమలు చేయలేదు. సీఏఏని ప్రజలు వ్యతిరేకిస్తుండటమే ఇందుకు కారణం. చట్టాన్ని ప్రజలపై రుద్దలేరు. ప్రజాస్వామ్య దేశంలో అలా జరగదు."
--- భునియా, తృణముల్​ కాంగ్రెస్​ ఎంపీ.

అయితే.. పౌరసత్వ చట్ట సవరణను మమతా బెనర్జీ ఆపలేరని బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ తెలిపారు. దేశవ్యాప్తంగా సీఏఏ అమలవుతుందన్నారు.

Last Updated : Jan 2, 2020, 2:43 PM IST

ABOUT THE AUTHOR

...view details