జమ్ము కశ్మీర్లో ఉన్న 10 కేంద్ర సాయుధ పోలీసు దళాల(సీఏపీఎఫ్) బృందాలను అక్కడి నుంచి ఉపసంహరించేందుకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం వెయ్యి మంది ఉండే ఈ దళాలను జమ్ము ప్రాంతం నుంచి తొలగించడానికి ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు.
జమ్ములో ఉపసంహరించిన సీఏపీఎఫ్ బృందాల్లో 9 విభాగాలను మహారాష్ట్రకు హోంశాఖ కేటాయించినట్లు తెలుస్తోంది. నాలుగు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రెండు సీఆర్పీఎఫ్, మూడు సీఐఎస్ఎఫ్ దళాలను ఆ రాష్ట్రానికి బదిలీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.