అంరత్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు విధించవద్దని రాష్ట్రాలకు.. కేంద్రం విజ్ఞప్తి చేసింది. అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో వ్యక్తులు, వస్తు రవాణా సాఫీగా జరిగేలా చూడాలని కోరింది.
ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. స్థానిక యంత్రాంగాలు అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు విధిస్తున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చిందని భల్లా పేర్కొన్నారు. ఈ ఆంక్షల వల్ల సప్లై చైన్‌పై ప్రభావం ఏర్పడి, ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలుగుతోందని అన్నారు. అంతర్రాష్ట్ర రవాణాతో పాటు, రాష్ట్రాలోని ప్రాంతాల మధ్య రవాణాకు ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని అన్‌లాక్ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయని లేఖలో వివరించారు.
అది ఉల్లంఘనే..
పొరుగుదేశాల నుంచి వ్యక్తులు, వస్తువుల రవాణా కోసం ప్రత్యేకమైన అనుమతులు అవసరం లేదని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు భల్లా. ఆంక్షలు విధించడం అంటే.. విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు అవుతుందని అన్నారు. నిబంధనలు పాటించి అన్‌లాక్ మార్గదర్శకాలు అమలు జరిగేలా చూడాలని రాష్ట్రాల అధికారులకు భల్లా సూచించారు.
లాక్డౌన్-అన్‌లాక్
దేశంలో మార్చి 25న లాక్డౌన్ ప్రారంభమైంది. మే 31 వరకు పూర్తి స్థాయిలో కొనసాగింది. తర్వాత జూన్ 1 నుంచి అన్‌లాక్ ప్రక్రియను అమలు చేస్తూ వస్తోంది కేంద్రం. నిలిచిపోయిన కార్యకలాపాలను క్రమంగా తెరిచేందుకు అనుమతులు ఇస్తోంది.
ఇదీ చదవండి:'దిల్లీ, అయోధ్యలో బాంబు దాడుల పేరిట బెదిరింపు!'