తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అద్దె ఇంటి వాసులకు, రిటైల్ వ్యాపారులకు వరాలు'

అద్దె ఇంటి చట్టాలను మారుస్తామన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ ప్రకటన సందర్భంగా నూతన అద్దె చట్టాలను రూపొందిస్తామని, దేశవ్యాప్తంగా గృహసముదాయాలను నిర్మిస్తామని ప్రకటించారు. కోటిన్నర ఆదాయం లోపు ఆదాయం ఉన్న వ్యాపారులకు పింఛను అందిస్తామన్నారు.

By

Published : Jul 5, 2019, 1:34 PM IST

'అద్దె ఇంటి వాసులకు, రిటైల్ వ్యాపారులకు వరాలు'

అద్దె ఇండ్లలో నివసించేవారు, రిటైల్ వ్యాపారులకు కేంద్రం వరాల జల్లు కురిపించింది. బడ్జెట్ ప్రకటన సందర్భంగా అద్దె ఇంటి చట్టాలు సరిగా లేవన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. నూతన నమూనా అద్దె చట్టాలను కేంద్రమే రూపొందించి రాష్ట్రాలకు అందిస్తుందన్నారు.

ప్రధానమంత్రి కరమ్ యోగి మాన్ ధన్

ప్రధానమంత్రి కరమ్ యోగి మాన్ ధన్ పథకం ద్వారా ఇప్పటివరకూ ఇస్తోన్న రిటైల్ వ్యాపారులకు పింఛను పథక పరిధిని పెంచుతున్నామన్నారు నిర్మల. ఏడాదికి కోటిన్నర కంటే తక్కువగా ఉన్న 3 కోట్ల మంది వ్యాపారులకు పింఛను అందిస్తామని వెల్లడించారు.

'అద్దె ఇంటి వాసులకు, రిటైల్ వ్యాపారులకు వరాలు'

"అద్దె ఇళ్లకు సంబంధించి కొన్ని సంస్కరణలను ప్రతిపాదిస్తున్నాం. ప్రస్తుత అద్దె చట్టాలు సొంతదారు, అద్దెదారు మధ్య వాస్తవిక సంబంధాన్ని సరిగా చూపించడం లేదు. ఒక నమూనా అద్దె చట్టాన్ని రూపొందించి రాష్ట్రాలకు అందిస్తాం. దేశవ్యాప్తంగా కేంద్రం పెద్ద గృహ సముదాయాలను కట్టిస్తుంది. సంయుక్త అభివృద్ధి కింద ప్రజా భవన సముదాయాలు, గృహాలను సరసమైన ధరలకే అందిస్తాం. వ్యాపారుల నుంచి వస్తోన్న ప్రతిస్పందనను అనుసరించి... కోటిన్నర ఆదాయం ఉన్న 3 కోట్ల మంది వ్యాపారులకు ప్రధానమంత్రి కరమ్ యోగి మాన్ ధన్ పథకం ద్వారా పింఛను అందించనున్నాం. దీనికి కేవలం ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ ఉంటే సరిపోతుంది."

-నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి

ఇదీ చూడండి: బడ్జెట్​ 2019 : 'నవీన భారతావనికి 10 సూత్రాలు'

ABOUT THE AUTHOR

...view details