తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సెంట్రల్​ విస్టా ప్రాజెక్టుకు మార్గం సుగమం - సుప్రీంకోర్టు

కేంద్రం 2వేల కోట్లతో ప్రారంభించిన సెంట్రల్​ విస్టా ప్రాజెక్టును ఆపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆ ప్రాజెక్టు కోసం భూ వినియోగంలో మార్పులు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​పై తుది తీర్పును వెలువరించింది సుప్రీం.

Central Vista matter: Superme Court today refused to stay the Central vista project, after hearing a petition challenging the Centre's decision to notify a change in land use regarding the redevelopment plan.
సెంట్రల్​ విస్టా ప్రాజెక్టుకు మార్గం సుగుమం

By

Published : Apr 30, 2020, 4:54 PM IST

కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ఆపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును కేంద్రం భూ వినియోగంలో మార్పులు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ఆపాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. దిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ సిఫార్సులపై సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్టుకు అవసరమైన భూవినియోగ మార్పునకు ఆమోదం తెలిపిన కేంద్రం.. కొత్త పార్లమెంట్​ భవనం నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.

1931లో ప్రస్తుత పార్లమెంట్​, రాష్ట్రపతి, నార్త్, సౌత్ బ్లాక్ భవనాలను నిర్మించగా....విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంట్ భవనంతోపాటు ప్రధాని, ఉప రాష్ట్రపతికి కొత్త నివాస భవనాల నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది.

ABOUT THE AUTHOR

...view details