తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఒక్కొక్కరుగా కేంద్రమంత్రుల పర్యటన!

కశ్మీర్ ​లోయలో అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు త్వరలో కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. ఒక్కొక్కరుగా పర్యటించి అక్కడి ప్రస్తుత పరిస్థితులను తెలుసుకుంటారు. ఆర్టికల్​ 370 రద్దు తర్వాత.. లోయలో పరిస్థితిని చక్కదిద్దేలా ప్రభుత్వం పలు కార్యక్రమాలను రూపొందించింది.

కశ్మీర్​లో ఒక్కొక్కరుగా కేంద్రమంత్రుల పర్యటన

By

Published : Aug 30, 2019, 5:05 AM IST

Updated : Sep 28, 2019, 7:57 PM IST

కశ్మీర్​లో ఒక్కొక్కరుగా కేంద్రమంత్రుల పర్యటన

జమ్ము కశ్మీర్​లో పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్రమంత్రులు ఒక్కొక్కరుగా పర్యటించనున్నారు. కశ్మీర్​లో అభివృద్ధి కార్యక్రమాల అమలు పర్యవేక్షణతో పాటు అక్కడి ప్రజలతో మంత్రులు మమేకం అయ్యేలా ప్రణాళికలను కేంద్రం రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులు రాజ్​నాథ్​ సింగ్​, అర్జున్​ ముందా లద్దాఖ్​లో పర్యటించారు. అధికరణ 370 రద్దు చేసినప్పటి నుంచి కశ్మీర్​ లోయలో ఎవరూ పర్యటించలేదు. ఈ నేపథ్యంలో వేర్వేరుగా కేంద్ర మంత్రులు లోయలో వ్యక్తిగతంగా పర్యటించి అక్కడి పరిస్థితులను గమనిస్తారు.

మంత్రులకు లక్ష్యాల నిర్దేశం

లోయలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కేంద్ర మంత్రులు, వారి శాఖలకు పలు లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రుల పర్యటనను కేబినెట్​ వ్యవహారాల శాఖ కార్యదర్శి పరిశీలిస్తారు.

నాయకుల విడుదల!

ఆర్టికల్​ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్​లో అదుపులోకి తీసుకున్న నేతలను ఒక్కొక్కరిగా విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

"మొట్టమొదటిగా జనసంచారానికి అనుమతి ఇచ్చారు. తర్వాత టెలిఫోన్​ సేవలను పునరుద్ధరించారు. నెమ్మదిగా కొన్ని ప్రాంతాల్లో మొబైల్​ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇదే విధంగా సమయాన్ని బట్టి అదుపులో ఉన్న రాజకీయ నాయకులను విడుదల చేస్తారు."

- ప్రభుత్వ ఉన్నతాధికారి

ఇదీ చూడండి: కశ్మీర్​ విభజన, అభివృద్ధిపై కేంద్రం ముమ్మర కసరత్తు

Last Updated : Sep 28, 2019, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details