పరమేశ్ది... గుబ్బి తాలూకా సిగ్గెనహళ్లి గ్రామం. సుమారు 20 ఎకరాల్లో పనస, కొబ్బరి, మామిడి పంట సాగు చేస్తున్నారు. 2017లో ఆయన తోటలో అరుదుగా లభించే పనస మొక్కను గుర్తించింది భారతీయ ఉద్యానవన పరిశోధన సంస్థ-ఐఐహెచ్ఆర్. ఈ మొక్కలకు కేరళ, ఆంధ్రప్రదేశ్, దిల్లీ, తమిళనాడులో మంచి డిమాండ్ ఉంది. 2020 వరకు దేశవ్యాప్తంగా ఏటా 25వేలు చొప్పున లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఐఐహెచ్ఆర్ అధికారులు. ఇందుకోసం పరమేశ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. గతేడాది మొక్కలు సరఫరా చేసినందుకు రూ.5లక్షలు చెల్లించారు.
ఈ అరుదైన చెట్టును, నాటేందుకు సిద్ధంగా ఉన్న పనస మొక్కలను కాపాడేందుకు పరమేశ్ సాహసం చేయాల్సి వస్తోంది. వేల రూపాయలు ఖర్చు చేసి తోటలోని పనస చెట్టుకు నాలుగు దిక్కుల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సెన్సార్లు బిగించాడు. తాను ఎక్కడున్నా... చెట్టు పరిసరాల్లో ఏం జరుగుతుందో మొబైల్ ఫోన్లో చూసే విధంగా ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు రానున్న రోజుల్లో కాపలాదారుడిని పెట్టాలని భావిస్తున్నారు పరమేశ్.
ఎందుకింత ప్రత్యేకం...?