తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హాథ్రస్ 'నిర్భయ' ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు - hathras bulgarhi village

హాథ్రస్ బాధితురాలి ఇంటి చుట్టూ 60 మంది పోలీసు సిబ్బంది మోహరించారు. సీసీటీవీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి గస్తీ కాస్తున్నారు. కుటుంబంలో ఒక్కో సభ్యుడికి ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది భద్రత కల్పిస్తున్నారు. అవసరమైతే ఆ గ్రామంలో ఓ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి బాధిత కుటుంబానికి రక్షణ కల్పిస్తామంటున్నారు.

CCTV cameras installed, 60 cops deployed to ensure security of Hathras victim's family: Police
హాథ్రస్ బాధితురాలి ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు!

By

Published : Oct 9, 2020, 4:26 PM IST

ఉత్తర్ ప్రదేశ్ హాథ్రస్ బాధితురాలి ఇంటి చుట్టూ 60 మంది పోలీసులను మోహరించినట్లు తెలిపారు లఖ్​నవూ డీఐజీ శలభ్ మాథుర్. కుటుంబంలో ఒక్కో సభ్యుడికి ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది భద్రత కల్పిస్తున్నారని పేర్కొన్నారు. బుల్గర్హి ప్రాంతంలోని ఇంటి చుట్టూ 8 సీసీటీవీలు అమర్చామని, అవసరమైతే గ్రామంలో ఓ కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

"ఇంటి చుట్టూ 60 మంది పోలీసు ఇబ్బందిని మోహరించాం. సిబ్బందిని పర్యవేక్షించడానికి ఓ గెజిటెడ్ అధికారిని కూడా నియమించనున్నాం. సీసీటీవీ కెమెరాల సహాయంతో బాధితురాలి ఇంటిని పర్యవేక్షిస్తున్నాం."

-శలభ్ మాథుర్, డీజీపీ

కుటుంబ సభ్యులను కలిసేందుకు వచ్చేవారి వివరాలు సేకరించేలా బాధితురాలి ఇంటి ద్వారం వద్ద ఓ రిజిస్టర్ ఏర్పాటు చేశామన్నారు హాథ్రస్ ఎస్పీ వినీత్ జైస్వాల్.

"ఇంటి ద్వారం వద్ద రిజిస్టర్, మెటల్ డిటెక్టర్ యంత్రాలను ఏర్పాటు చేశాం. తక్షణ స్పందన బృందాలను మోహరించాం. ఎనిమిది సీసీటీవీ కెమెరాలతో భద్రత కల్పిస్తున్నాం. "

-వినీత్ జైస్వాల్, హాథ్రస్ ఎస్పీ

ఇదీ చదవండి: బంగాల్​లో రాజుకున్న వేడి- దీదీ సర్కారుకు తిప్పలేనా ?

ABOUT THE AUTHOR

...view details