సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పది, పన్నెండు తరగతుల ప్రశ్నపత్రాల నమూనాలో మార్పులను చేయనున్నట్లు తెలిపింది. విద్యార్థుల్లో సృజనాత్మక, విశ్లేషణాత్మక ఆలోచనల్ని పెంచడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. 2023 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొంది.
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా-అసోచామ్ నిర్వహించిన పాఠశాల విద్యా సదస్సులో సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి ఈ ప్రతిపాదనను తెలిపారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసకున్నట్లు వెల్లడించారు.
"ప్రస్తుతం ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు 20 శాతం ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, 10 శాతం ప్రశ్నలు సృజనాత్మకతపై ఉంటాయి. 2023 నాటికి 10, 12 తరగతుల ప్రశ్నాపత్రాలు సృజనాత్మక, వినూత్న విమర్శనాత్మక సమాధానాలను కోరేలా ఉంటాయి."