తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీబీఎస్ఈలో పాఠ్యాంశాలుగా కృత్రిమ మేధ, యోగ - యోగా

సీబీఎస్​ఈ పాఠశాలల బోధన ప్రణాళికలో మూడు కొత్త పాఠ్యాంశాలు ప్రవేశపెట్టనుంది బోర్డు. కృత్రిమమేధ సహా చిన్నారుల సంరక్షణ విద్య, యోగాలను నూతన పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు.  విద్యార్థులు అన్ని అంశాలపై పట్టు సాధించేందుకు, చైతన్యవంతుల్ని చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ఉన్నతాధికారి తెలిపారు.

సీబీఎస్ఈ

By

Published : Mar 25, 2019, 8:41 AM IST

సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)​ పాఠ్య ప్రణాళికలో మరో మూడు కొత్త పాఠ్యాంశాలను చేర్చనున్నట్లు బోర్డు సీనియర్​ అధికారి తెలిపారు. ఇందులో కృత్రిమ మేధ సహా చిన్నారుల సంరక్షణ విద్య, యోగాలను నూతన పాఠ్యాంశాలుగా పరిచయం చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సీబీఎస్ఈలో నూతన పాఠ్యాంశాలు

తాజా బోర్డు సమావేశంలో దీనిపై ఆమోదం లభించిందని, 9వ తరగతిలో కృత్రిమ మేధ పాఠ్యాంశాన్ని ఐచ్ఛికాంశంగా పరిచయం చేయనున్నట్లు స్పష్టం చేశారు. కాగా, 8వ తరగతిలోనే దీని పరిచయ బోధన ఉండనున్నట్లు తెలిపారు.

సీనియర్​ సెకండరీ స్థాయిలో యోగ, చిన్నారుల సంరక్షణ విద్యను ప్రవేశపెట్టనున్నారు. మొత్తం 42 పాఠ్యాంశాల నుంచి ఒకటి లేదా రెండు నైపుణ్యాధారిత పాఠ్యాంశాలను ఎన్నుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలని పాఠశాలలకు బోర్టు సలహా ఇచ్చింది.

''యోగా, బాలల సంరక్షణ బోధన సిబ్బంది అవసరం ఉన్నట్లు కొన్ని పాఠశాలలు పలు నివేదికల్లో తెలిపిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. కొత్తగా పరిచయం చేస్తున్న అంశాలను అమలు పరిచేందుకు ఉపాధ్యాయులకు సరైన శిక్షణ, మార్గదర్శకాన్ని ఇస్తాం.'' - బోర్డు సీనియర్​ అధికారి

సీబీఎస్​ఈ విద్యార్థులెవరైనా ఎన్నుకున్న పాఠ్యాంశాల్లో(గణితం, సామాన్య శాస్త్రం, సామాజిక శాస్త్రం) ఏదైనా ఫెయిల్​ అయితే.. నైపుణ్య పాఠ్యాంశంతో భర్తీ చేస్తారు. ఒకవేళ ఆ విద్యార్థి తప్పిన పాఠ్యాంశాన్నే మళ్లీ రాసుకునేందుకూ వీలు కల్పించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details