తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీబీఎస్​ఈ విద్యార్థులకు పరీక్షలు లేకుండానే ప్రమోషన్​

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ నేపథ్యంలో కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1నుంటి 8తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్​ చేయాలని సీబీఎస్​ఈని ఆదేశించింది. 10, 12 తరగతుల విద్యార్థులు పైతరగతులకు వెళ్లేందుకు, ఉన్నత స్థాయి విద్యాసంస్థల్లో చేరేందుకు అవసరమైన 29 సబ్జెక్టుల్లో మాత్రం బోర్డు పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపింది.

CBSE
సీబీఎస్​ఈ విద్యార్థులు పరీక్షలు లేకుండానే పై తరగతులకు

By

Published : Apr 2, 2020, 5:17 AM IST

దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌సీ) ఇప్పటికే తుది పరీక్షలు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై విద్యార్థుల వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనను తొలగిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు లేకుండా వారిని పై తరగతులకు ప్రమోట్ చేయాలని సీబీఎస్‌ఈని ఆదేశించింది. ఇక 9 నుంచి 11 తరగతుల విద్యార్థులను అంతర్గంతంగా పాఠశాలలో నిర్వహించిన ప్రాజెక్టులు, పరీక్షల మార్కుల ఆధారంగా తర్వాతి తరగతులకు ప్రమోట్ చేయాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్‌ తన ట్విట్టర్​ ఖాతా ద్వారా ప్రకటన చేశారు.

అయితే ఇప్పుడు పై తరగతులకు ప్రమోట్ కాని విద్యార్థులు తర్వాత పాఠశాలలో నిర్వహించే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పరీక్షలకు హాజరుకావచ్చని తెలిపారు. 10, 12 తరగతుల విద్యార్థులకు పై తరగతులకు వెళ్లేందుకు, ఉన్నత స్థాయి విద్యాసంస్థల్లో చేరేందుకు అవసరమైన 29 సబ్జెక్టుల్లో మాత్రం బోర్డు పరీక్షలు నిర్వహిస్తుందని మరో ప్రకటనలో తెలిపారు కేంద్రమంత్రి. అయితే పరిస్థితులను బట్టి ఈ పరీక్షల నిర్వహణ తేదీలను ముందుగా ప్రకటిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే పలు రాష్ట్రాల విద్యాశాఖలు లాక్‌డౌన్‌ కారణంగా 1 నుంచి 8 తరగతుల విద్యార్థులను ఎటువంటి తుది పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

విదేశాల్లోనూ...

కరోనా నేపథ్యంలో విదేశాల్లో నిర్వహించాల్సిన 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను నిలిపివేస్తున్నట్లు సీబీఎస్​ఈ అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో సీబీఎస్​ఈ పాఠశాలలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశాల్లో లాకౌడౌన్లు, ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ కారణంగానే పరీక్షలు నిర్వహించబోమని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'కన్నా.. నీపై ప్రేమున్నా ముద్దాడలేకపోతున్నా'

ABOUT THE AUTHOR

...view details