తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫేస్​బుక్​, సీబీఎస్​ఈల భాగస్వామ్యంలో వినూత్న కార్యక్రమం

ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్​బుక్​, సెంట్రల్​​ బోర్డ్​ ఆఫ్​​ సెకండరీ ఎడ్యుకేషన్​(సీబీఎస్‌ఈ) ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. విద్యార్థులు, విద్యావేత్తల కోసం 'డిజిటల్​ సేఫ్టీ', 'ఆన్‌లైన్ వెల్​బీయింగ్​', 'ఆగ్మెంటెడ్ రియాలిటీ'లపై పాఠ్యాంశాలను ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్​ నిశాంక్​ తెలిపారు.

CBSE partners with Facebook for curriculum on digital safety, augmented reality
ఫేస్​బుక్​, సీబీఎస్​ఈల భాగస్వామ్యంలో వినూత్న కార్యక్రమం

By

Published : Jul 6, 2020, 5:49 AM IST

విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం 'డిజిటల్​ సేఫ్టీ', 'ఆన్‌లైన్ వెల్​బీయింగ్​', 'ఆగ్మెంటెడ్ రియాలిటీ'లపై పాఠ్యాంశాలను ప్రారంభించడానికి సెంట్రల్​​ బోర్డ్​ ఆఫ్​​ సెకండరీ ఎడ్యుకేషన్​(సీబీఎస్‌ఈ), ఫేస్‌బుక్​ జట్టుకట్టాయి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్​ నిశాంక్​ ప్రకటించారు.

'ఉపాధ్యాయుల కోసం 'ఆగ్మెంటెడ్ రియాలిటీ', విద్యార్థుల కోసం 'డిజిటల్​ సేఫ్టీ', 'ఆన్‌లైన్ వెల్​బీయింగ్​'లలో సర్టిఫైడ్​ ప్రోగ్రామ్​లను ప్రవేశపెట్టినందుకు సీబీఎస్‌ఈ, ఫేస్‌బుక్‌ల భాగస్వామ్యాన్ని అభినందిస్తున్నాను. జులై 6 నుంచి ప్రారంభించే ఈ కార్యక్రమానికి విద్యార్థులు, విద్యావేత్తలు దరఖాస్తు చేసుకోవాలి.' అని ట్వీట్​ చేశారు పోఖ్రియాల్​.

ఫేస్​బుక్​ నాయకత్వంలో..

ఈ సమగ్ర పాఠ్యాంశాలు విద్యార్థులకు భవిష్యత్తులో ఉపాధి కల్పనకు, ఆన్​లైన్​ వేదికలపై మంచి నడవడిక అలవరుచుకోవడానికి సహాయపడతాయని సీబీఎస్​ఈ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ఫేస్​బుక్​ ఫర్​ ఎడ్యుకేషన్ నాయకత్వం వహిస్తుందని వెల్లడించారు.

బాధ్యతాయుతమైన విద్యార్థులుగా..

రక్షణ, గోప్యత, మానసిక ఆరోగ్యం, విలువలతో కూడిన డిజిటల్​ అలవాట్లను నేర్పించడానికి ఇన్​స్టాగ్రామ్​ మార్గదర్శకాలు ఈ పాఠ్యాంశాల్లో పొందిపరిచారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన డిజిటల్ వినియోగదారులుగా తీర్చిదిద్దేందుకు, బెదిరింపులు, వేధింపులు, తప్పుడు సమాచారాన్ని గుర్తించేలా మాడ్యుల్స్​ను రూపొందించారు.

మూడు వారాల శిక్షణ..

సామాజిక పరిశోధన కేంద్రం(సీఎస్​ఆర్)​ ఇచ్చే ఈ శిక్షణలో మొదట 10వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. రెండో విడతలో వీరంతా 30వేల మంది విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు.

ఇదీ చూడండి:'మరోసారి మిడతల దండయాత్ర.. జర జాగ్రత్త'

ABOUT THE AUTHOR

...view details