ఉత్తర్ప్రదేశ్లో టెలివిజన్ రేటింగ్ పాయింట్ల(టీఆర్పీ) అవకతవకలపై కేంద్ర దర్యాప్తు బృందం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఓ ప్రచార కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్లో ప్రాథమికంగా ఈ కేసు రిజిస్టర్ అయిందని అధికారులు వెల్లడించారు. యూపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసును సీబీఐకి బదిలీ చేసినట్లు చెప్పారు.
తాజాగా ఉత్తర్ప్రదేశ్ పోలీసులు అందించిన వివరాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. డబ్బులు తీసుకొని టీఆర్పీని తారుమారు చేస్తున్నారనేది ప్రధాన అభియోగమని చెప్పారు. అయితే ఎవరిపై అభియోగాలు మోపారనే విషయాలు వెల్లడించలేదు.