తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాల్ సెంటర్​ స్కామ్​లో రూ.190 కోట్లు సీజ్: సీబీఐ

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడిన ఆరు సంస్థల నుంచి రూ.190 కోట్ల ఆస్తులను సీబీఐ సీజ్ చేసింది. అనేక డిజిటల్ ఆధారాలతో పాటు, రూ.55 లక్షలు విలువైన బంగారం, రూ.25 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. సీబీఐ ఈ దర్యాప్తుతో అమెరికా న్యాయ శాఖ ప్రశంసలు అందుకుంది.

CBI searches 6 firms targeting computer users through tech support scam, Rs 190-cr assets seized
6 సంస్థల నుంచి రూ.190 కోట్లు సీజ్: సీబీఐ

By

Published : Oct 16, 2020, 7:33 PM IST

సాంకేతిక సహాయం చేస్తామంటూ మైక్రోసాఫ్ట్​ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని కుంభకోణానికి పాల్పడిన ఆరు సంస్థల నుంచి రూ.190 కోట్లు విలువైన ఆస్తులను కేంద్ర దర్యాప్తు బృందం(సీబీఐ) సీజ్ చేసింది. సెప్టెంబర్ 17న నిర్వహించిన ఈ సోదాల్లో ఆస్తులతో పాటు 55 లక్షల విలువైన బంగారం, రూ.25 లక్షల నగదు, అనేక డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది సీబీఐ.

కుంభకోణం ఏంటంటే...

మాల్​వేర్​ ఉందని వినియోగదారులకు పాప్-అప్ సందేశాలను పంపించి కంప్యూటర్లలోకి చొరబడేందుకు నేరస్థులు ప్రయత్నించారని సీబీఐ అధికారులు తెలిపారు. పాప్​-అప్​లో ఇచ్చిన నెంబర్​కు డయల్ చేస్తే.. కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్​ భారీగా నగదు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. మాల్​వేర్​ను తొలగిస్తామని చెప్పి.. అనవసర సాఫ్ట్​వేర్లను ఇన్​స్టాల్ చేసినట్లు వెల్లడించారు.

కేసుకు సంబంధించి జైపుర్, దిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, మైన్​పురీలోని ప్రైవేటు కంపెనీల కార్యాలయాలు, నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లు వివరించారు. మరింత విచారణ కొనసాగుతోందని తెలిపారు.

సీబీఐ చేపట్టిన దర్యాప్తును అమెరికా న్యాయ శాఖ ప్రశంసించిందని అధికారులు తెలిపారు. ఇలాంటి నేరాల్లో విచారణ కోసం.. అమెరికాతో పాటు భారత్​కు సన్నిహితంగా ఉండే దేశాల్లోని దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details