తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పిలాటస్​' ఒప్పందంలో అవినీతిపై సీబీఐ కేసు - వైమానికదళ అధికారులు

'పిలాటస్​' శిక్షణా​ విమానాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో కొందరు వైమానిక దళ, రక్షణ మంత్రిత్వ శాఖాధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయుధ వ్యాపారి సంజయ్​ భండారీపైనా కేసు పెట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థ. అక్రమ చెల్లింపులను ప్రోత్సహించిన పిలాటస్​ సంస్థపైనా అభియోగాలు నమోదు చేసింది.

'పిలాటస్​' విమానాల ఒప్పందంలో అవినీతిపై సీబీఐ కేసు

By

Published : Jun 22, 2019, 2:27 PM IST

'పిలాటస్​' విమానాల కొనుగోలులో అవినీతి ఆరోపణలపై పలువురు వైమానికదళ అధికారులు, రక్షణ మంత్రిత్వశాఖ అధికారులపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. వివాదాస్పద ఆయుధాల వ్యాపారి సంజయ్​ భండారీపైనా అభియోగాలు నమోదు చేసింది.

2009లో 75 పిలాటస్​ బేసిక్​ ట్రైనర్​ విమానాలను స్విట్జర్లాండ్​ నుంచి కొనుగోలు చేయడానికి ఒప్పందం జరిగింది. అయితే ఇందులో భారీగా అవినీతి జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ప్రస్తుతం ఆయుధాల వ్యాపారి సంజయ్​ భండారీ నివాసం, కార్యాలయంల్లోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది.

ఈ ఒప్పందంలో రూ.339 కోట్ల విలువైన అక్రమ చెల్లింపులను ప్రోత్సహించిన స్విట్జర్లాండ్​కు చెందిన పిలాటస్​ సంస్థపైనా సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.

ఇదీ చూడండి: నడిరోడ్డు మీద పోలీసుపై దుండగుల దాడి

ABOUT THE AUTHOR

...view details