తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాబ్రీ కేసులో కల్యాణ్​సింగ్​పై​ విచారణకు సీబీఐ సిద్ధం! - రాజస్థాన్​ మాజీ గవర్నర్​

రాజస్థాన్​ మాజీ గవర్నర్​ కల్యాణ్​ సింగ్​ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రత్యేక కోర్టును కోరింది సీబీఐ. గవర్నర్​గా పదవీకాలం ముగిసిన నేపథ్యంలో బాబ్రీ కేసులో కల్యాణ్​సింగ్​ను విచారించాల్సి ఉందని కోర్టుకు నివేదించింది.

బాబ్రీ కేసులో కల్యాణ్​సింగ్​పై​ విచారణకు సీబీఐ సిద్ధం!

By

Published : Sep 9, 2019, 10:41 PM IST

Updated : Sep 30, 2019, 1:40 AM IST

బాబ్రీ కేసులో రాజస్థాన్​ మాజీ గవర్నర్​ కల్యాణ్ సింగ్​ను విచారించేందుకు ప్రత్యేక కోర్టును అనుమతి కోరింది సీబీఐ. ఇప్పటి వరకు రాజ్యాంగ పదవిలో ఉన్న కారణంగా కల్యాణ్​ సింగ్​కు విచారణ నుంచి విముక్తి లభించింది. ప్రస్తుతం పదవీకాలం ముగియటం వల్ల పునర్విచారణకు అనుమతించాలని దరఖాస్తు దాఖలు చేసింది సీబీఐ.

సెప్టెంబర్​ 3తో పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో సీబీఐ దరఖాస్తును స్వీకరించింది కోర్టు. దీనిపై బుధవారం విచారణ జరిగే అవకాశం ఉంది. ఇదే కేసులో భాజపా అగ్రనేతలు ఎల్​కే అడ్వాణీ, మురళి మనోహర్​ జోషీ నిందితులుగా ఉన్నారు.

భాజపాలో చేరిన సింగ్​

గవర్నర్​గా పదవీకాలం ముగించుకున్న 87 ఏళ్ల కల్యాణ్​ సింగ్​ నేడు మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. లఖ్​నవూలో భాజపా సీనియర్​ నేతల సమక్షంలో పార్టీలో చేరారు. యూపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు స్వతంత్రదేవ్.. కల్యాణ్​ సింగ్​కు పార్టీ సభ్యత్వం అందజేశారు.

1992లో బాబ్రీ ఘటన సమయంలో ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రిగా ఉన్నారు కల్యాణ్ సింగ్. 1993లో ఆయనపై ఛార్జిషీటు నమోదయింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరూ బెయిల్​పై ఉన్నారు.

ఇదీ చూడండి: కేంద్ర రవాణాశాఖ మంత్రికే తప్పని ట్రాఫిక్​ చలానా!

Last Updated : Sep 30, 2019, 1:40 AM IST

ABOUT THE AUTHOR

...view details