బాబ్రీ ఘటన కేసు విచారణ జూన్ 4 నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరుల వాంగ్మూలాలను నమోదు చేయనున్నారు. లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్కే యాదవ్.. బాబ్రీ కేసు విచారణ చేపట్టనున్నారు.
బాబ్రీ కేసు నిందితుల వాంగ్మూలం నమోదుకు ఆదేశం - Babri masjid demolition
బాబ్రీ మసీదు కూల్చివేత నిందితులు.. తమ వాంగ్మూలాలను సమర్పించేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. తాము నిరపరాధులమని నిరూపించుకునేందుకు నిందితులకు మరో అవకాశమిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
బాబ్రీ మసీదు కేసులో జూన్ 4 నుంచి నిందితుల వాంగ్మూలాలు
క్రిమినల్ పీనల్ కోడ్ 313 ప్రకారం నిందితుల వాంగ్మూలాలు నమోదు చేయనున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో తాము నిరపరాధులమని చెప్పుకునేందుకు నిందితులకు ఇదో అవకాశమని తెలిపారు. ప్రాసిక్యూషన్ సేకరించిన ఆధారాల గురించి కూడా నిందితులకు వివరిస్తామని లఖ్‌నవూ సీబీఐ ప్రత్యేక కోర్టు వెల్లడించింది.
ఇదీ చదవండి:'బాబ్రీ' కేసు తీర్పునకు 3నెలల గడువు పెంపు