తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో 3రోజులు చిదంబరం కస్టడీ పొడిగింపు - case

నాలుగు రోజుల కస్టడీ గడువు ముగిసిన తర్వాత చిదంబరంను కోర్టు ముందు హాజరుపరిచింది సీబీఐ. విచారణకై మరో 5రోజులు కస్టడీ పొడిగించాలని కోర్టును కోరగా కోర్టు 3రోజులు పొడిగించింది.

మరో 3రోజులు చిదంబరం కస్టడీ పొడిగింపు

By

Published : Aug 30, 2019, 4:05 PM IST

Updated : Sep 28, 2019, 9:03 PM IST

ఐఎన్​ఎక్స్​ మీడియా అక్రమ లావాదేవీల కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కస్టడీ మరో మూడు రోజులు పొడిగించింది దిల్లీ కోర్టు. 4 రోజుల సీబీఐ కస్టడీ గడువు ముగిసిన నేపథ్యంలో చిదంబరంను కోర్టుకు తీసుకొచ్చారు సీబీఐ అధికారులు.

కేసుకు సంబంధించి విచారణ ఇంకా పూర్తి కాలేదని, మరో 5 రోజులు కస్టడీ పొడిగించాలని కోర్టును కోరారు. ఈ మేరకు సెప్టెంబర్​ 2వరకు గడువు పొడిగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్​ కుహార్​ ఉత్తర్వులు జారీ చేశారు.

8రోజుల వరకు సాగిన విచారణ

ఇదే కేసుకు సంబంధించి ఆగస్టు 20న చిదంబరం పెట్టుకున్న బెయిల్​ పిటీషన్​ను దిల్లీ కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి 8 రోజులుగా కేంద్ర మాజీ మంత్రిని సీబీఐ విచారణ జరుపుతూనే ఉంది.

సుప్రీంకు చిదంబరం విచారణ పత్రాల అందజేత

ఐఎన్​ఎక్స్​ మీడియా మనీలాంండరింగ్​ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం విచారణకు సబంధించిన పత్రాలను ఈడీ సుప్రీం కోర్టుకు సమర్పించింది. తన అధికారిక ముద్రతో సీలు వేసిన కవర్​లో ఈ పత్రాలను అందజేసింది.

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో చిదంబరానికి అరెస్టు నుంచి రక్షణ కల్పించే నేపథ్యంలో విచారణకు సంబంధించిన పత్రాలను ఈడీ సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.

ఈ కేసులో భాగంగా ఆగస్టు 20న దిల్లీ హైకోర్టులో చిదంబరం బెయిల్​కై అభ్యర్థించగా అందుకు కోర్టు నిరాకరించింది. దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు కేంద్ర మాజీ మంత్రి. ఈ పిటిషన్​పై సెప్టెంబర్​ 5 న తీర్పును వెలువరించనున్నట్లు సుప్రీం తెలిపింది.

Last Updated : Sep 28, 2019, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details