తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిిన ఐటీ అధికారి - లంచం

లంచం తీసుకుంటున్న ఐటీ అధికారిని అడ్డంగా పట్టుకున్నారు సీబీఐ అధికారులు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. పన్ను బకాయిల విషయంలో ఓ వ్యక్తి నుంచి రూ.14 లక్షలు లంచం తీసుకున్నట్లు పేర్కొన్నారు అధికారులు.

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఐటీ అధికారి

By

Published : Apr 4, 2019, 10:49 PM IST

ఆదాయపన్ను శాఖ అధికారులపై సీబీఐ దాడులు నిర్వహించింది. ఐటీ అధికారులు లంచం పుచ్చుకుంటున్నారనే పక్కా సమాచారంతో మాటు వేసి పట్టుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

పన్ను బకాయిల పరిష్కారం విషయంలో ఇద్దరు ఐటీ అధికారులు లంచం డిమాండ్​ చేసినట్లు ఓ వ్యక్తి సీబీఐని ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో సీబీఐ అధికారులు ఐటీ అధికారి హెచ్​.ఆర్​ నగేశ్​ రూ. 14 లక్షలు తీసుకుంటుండగా అడ్డంగా పట్టుకున్నారు.

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఐటీ అధికారి

" ఫిర్యాదుదారుని నుంచి రూ.14 లక్షలు లంచం డిమాండ్​ చేసిన ఇద్దరు ఐటీ అధికారులపై కేసు నమోదు చేశాం. అతని కార్యాలయంలో ఐటీ శాఖ నిర్వహించిన సర్వేలో తేలిన సమస్యలను పరిష్కరించడానికి లంచం డిమాండ్​ చేసినట్లు ఆరోపణలున్నాయి."

- సీబీఐ అధికార ప్రతినిధి

నగేశ్​ ఇంటిపై దాడులు నిర్వహించారు సీబీఐ అధికారులు. మరో బృందం నగేశ్​కు చెందిన కాఫీ డే దుకాణంలో సోదాలు నిర్వహించింది. సోదాల్లో భాగంగా రికార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నగేశ్​తో పాటు మరో అధికారి నరేంద్ర సింగ్​ను అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తరలించారు.

జరిగిన కథేంటి?

మార్చి 6న నగేశ్​ బృందం 'విండెర్స్​ ఎడిఫిక్'​ సంస్థలో ఆదాయ పన్నుకు సంబంధించిన సర్వే నిర్వహించింది. విచారణలో భాగంగా రూ.25 లక్షలు, రూ.15 లక్షల విలువైన రశీదులను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 11న సంస్థ ఎండీ శ్రీనివాస్​ను విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

ఆ తరువాత మార్చి 19న నగేశ్​, నరేంద్ర సింగ్​లు రూ. 40 లక్షలు ఇవ్వాలని ఆ వ్యక్తిని డిమాండ్​ చేశారు. ముందుగా రూ. 20 లక్షలు ఇవ్వాలని తెలిపారు. ఈ సమాచారం అందుకున్న సీబీఐ వారిపై దాడులు చేపట్టింది.

ప్రస్తుతం ఇరువురిని ఉద్యోగాల్లోంచి తొలగించినట్లు సమాచారం. ఈ విషయంలో ఆదాయపన్ను శాఖ ఇంకా ఏ సమాచారం వెల్లడించలేదు.

ABOUT THE AUTHOR

...view details