తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిదంబరంను అదుపులోకి తీసుకున్న సీబీఐ

సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు

By

Published : Aug 21, 2019, 10:31 AM IST

Updated : Sep 27, 2019, 6:13 PM IST

21:47 August 21

చిదంబరంను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు

  • గంటసేపు హైడ్రామా తర్వాత అదుపులోకి తీసుకున్న సీబీఐ
  • చిదంబరంను కారులో తరలిస్తున్న సీబీఐ అధికారులు

21:41 August 21

ఏ క్షణంలోనైనా చిదంబరం అరెస్టు?

  • చిదంబరం ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన 3 సీబీఐ బృందాలు
  • సీబీఐ బృందానికి సహకరించేందుకు వచ్చిన 20 మంది దిల్లీ పోలీసులు
  • చిదంబరం ఇంటి ఆవరణలో సీబీఐ వాహనం సిద్ధం
  • చిదంబరంను ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకునే అవకాశం

21:14 August 21

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా

  • మీడియా సమావేశం తర్వాత జోర్‌బాగ్‌లోని నివాసానికి వెళ్లిన చిదంబరం
  • చిదంబరంతో పాటు ఆయన ఇంటికి వెళ్లిన కపిల్ సిబల్, అభిషేక్ సింగ్వి
  • చిదంబరం నివాసానికి వెళ్లిన సీబీఐ, ఈడీ విచారణ బృందాలు
  • ఇంట్లోకి ప్రవేశించేందుకు నిరాకరించిన చిదంబరం వ్యక్తిగత సిబ్బంది
  • సిబ్బంది నిరాకరణతో గోడ దూకి ప్రవేశించిన విచారణ బృందాలు
  • చిదంబరం ఇంటి ఆవరణలోని గోడ దూకి ప్రవేశించిన సీబీఐ, ఈడీ అధికారులు

20:40 August 21

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు విషయమై చిదంబరం వివరణ

  • నేను, నా కుటుంబసభ్యులు ఎలాంటి నేరంలోనూ నిందితులుగా లేరు: చిదంబరం
  • నాపై కోర్టులో సీబీఐ, ఈడీ ఎలాంటి ఛార్జిషీట్‌ నమోదు చేయలేదు: చిదంబరం
  • ఏడాదిన్నరపాటు తాత్కాలిక రక్షణ లభించింది: చిదంబరం
  • నాపై, నా కుమారుడిపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: చిదంబరం
  • శుక్రవారం కేసులు పెడతారని నా న్యాయవాదులు తెలిపారు: చిదంబరం
  • సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటాను: చిదంబరం
  • నేను చట్టాన్ని గౌరవిస్తాను: చిదంబరం
  • గత 24 గంటల్లో చాలా జరిగింది: చిదంబరం
  • ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా ఉందని నమ్ముతున్నా: చిదంబరం
  • ఏడు నెలల తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్‌ రద్దు చేసింది: చిదంబరం

20:19 August 21

మీడియా ముందుకు చిదంబరం

నిన్నటి నుంచి అజ్ఞాతంలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఎవరూ ఊహించని విధంగా మీడియా ముందుకొచ్చారు. దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఐఎన్​ఎక్స్​ కేసులో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు.

14:48 August 21

చిదంబరానికి కోర్టులో చుక్కెదురు.... అరెస్టుపై సర్వత్రా ఉత్కంఠ

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు చుక్కెదురైంది. చిదంబరం వేసిన పిటిషన్​ అత్యవసరంగా విచారించడానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

పిటిషన్​లో లోపాలు

చిదంబరం తరపు న్యాయవాదులు వేసిన స్పెషల్​ లీవ్ పిటిషన్​లో లోపాలు ఉన్న కారణంగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ విచారణకు అనుమతించలేదు. కోర్టు విచారణ జాబితాలో లేనందున కేసు వాదనలు వినడం కుదరదని జస్టిస్ ఎన్​.వి.రమణ స్పష్టం చేశారు. ఫలితంగా చిదంబరం బెయిల్ కొనసాగింపు పిటిషన్​ ఇవాళ విచారణకు వచ్చే అవకాశాలు లేనట్లే.

అరెస్టు తప్పదా?

ఇది చిదంబరానికి ఇబ్బంది కలిగించే అంశమే. ఈడీ లుక్​ అవుట్​ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఆయన అరెస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇదీ జరిగింది

2007లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో...  ఐఎన్​ఎక్స్​ మీడియా గ్రూపునకు రూ.305 కోట్ల విదేశీ నిధులు అందాయి. అయితే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్టు (ఎఫ్​ఐపీబీ) క్లియరెన్స్​ విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా సీబీఐ 2017 మే 15న ఐఎన్​ఎక్స్​ మీడియాపై కేసు నమోదు చేసింది. ఆ తరువాత ఇదే మీడియా గ్రూపుపై 2018లో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ (ఈడీ) అక్రమ నగదు చలామణి కేసు నమోదు చేసింది.

ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​ను నిన్న దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ, ఈడీ అధికారులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. రెండుసార్లు చిదంబరం ఇంటికెళ్లినా ఆయన లేకపోవడం వల్ల వెనుదిరిగారు. రాత్రి సమయంలో ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. వెంటనే తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

సుప్రీంలో బెయిల్ పిటిషన్

సీబీఐ, ఈడీలు తనను అరెస్టు చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో చిదంబరం పిటిషన్​ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీం నిరాకరించింది.

కేంద్రంపై తీవ్ర విమర్శలు...

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యవహారంలో కేంద్రం తీరుపై కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ, కొన్ని మీడియా సంస్థలను ఉపయోగించుకుని చిదంబరం వ్యక్తిత్వ హననానికి, ఆయన ప్రతిష్ఠను దిగజార్చేందుకు మోదీ సర్కార్​ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు రాహుల్.

సత్యం కోసం పోరాటం కొనసాగిస్తాం...

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ... చిదంబరానికి బాసటగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ సత్యం కోసం పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ అధికార ప్రతినిధులు రణదీప్ సుర్జేవాలా, ఆనందశర్మ కూడా చిదంబరానికి సంఘీభావం తెలిపారు.

రాజకీయ కక్ష సాధింపే..

చిదంబరంపై సీబీఐ, ఈడీ చర్యలు రాజకీయ కక్షసాధింపేనని డీఎంకే అధినేత స్టాలిన్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను చిదంబరం సమర్థంగా ఎదుర్కోగలరని ధీమా వ్యక్తంచేశారు.
 

14:32 August 21

చిదంబరం అరెస్టుపై సర్వత్రా ఉత్కంఠ

చిదంబరం తరపు న్యాయవాదులు వేసిన స్పెషల్​ లీవ్ పిటిషన్​లో లోపాలు ఉన్న కారణంగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ విచారణకు అనుమతించలేదు. కోర్టు విచారణ జాబితాలో లేనందున కేసు వాదనలు వినడం కుదరదని జస్టిస్ ఎన్​.వి.రమణ స్పష్టం చేశారు. ఫలితంగా చిదంబరం బెయిల్ కొనసాగింపు పిటిషన్​ ఇవాళ విచారణకు వచ్చే అవకాశాలు లేనట్లే.

ఇది చిదంబరానికి ఇబ్బంది కలిగించే అంశమే. ఈడీ లుక్​ అవుట్​ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఆయన అరెస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

14:24 August 21

చిదంబరం కేసు విచారణ ఇవాళ లేనట్లే

చిదంబరం దాఖలు చేసిన స్పెషల్​ లీవ్​ పిటిషన్​లో లోపాల కారణంగా విచారణకు అనుమతించని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ

కోర్టు విచారణ జాబితాలో లేకుండా కేసు వాదనలు వినడం కుదరదని స్పష్టం చేసిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

చిదంబరం బెయిల్‌ కొనసాగింపు పిటిషన్‌ ఇవాళ విచారణకు వచ్చే అవకాశాలు లేనట్లే
 

13:43 August 21

చిదంబరం ఎస్​ఎల్​పీ పిటిషన్​లో లోపాలు

చిదంబరం తరఫున న్యాయవాదులు వేసిన స్పెషల్​ లీవ్​ పిటిషన్​లో లోపాలు. లోపాల కారణంగా విచారణకు అనుమతివ్వని సుప్రీం కోర్టు రిజిస్ట్రీ. చిదంబరానికి తప్పని ఇక్కట్లు. లుక్​అవుట్​ నోటీసుల నేపథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి అరెస్ట్​పై ఉత్కంఠ

భోజన విరామ సమయంలో పరిశీలించనున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్

13:36 August 21

చిదంబరంపై సీబీఐ, ఈడీ చర్యలు రాజకీయ కక్ష సాధింపే: స్టాలిన్​

చిదంబరంపై సీబీఐ, ఈడీ చర్యలు రాజకీయ కక్షసాధింపేనని డీఎంకే అధినేత స్టాలిన్‌ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను చిదంబరం సమర్థంగా ఎదుర్కోగలరని స్పష్టం చేశారు. 

12:53 August 21

కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది: రాహుల్​ గాంధీ

కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

మోదీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపణ

ఈడీ, సీబీఐల సహకారంతో చిదంబరం వ్యక్తిత్వ హననకు కుట్ర పన్నుతున్నారని ఆరోపణ

వెన్నెముక లేని మీడియా కూడా ఇందుకు సహకరిస్తోందని ఆవేదన

12:39 August 21

సుప్రీంకోర్టులో సీబీఐ కేవియట్ పిటిషన్

సుప్రీంకోర్టులో సీబీఐ కేవియట్ పిటిషన్​ దాఖలు చేసింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రి వేసిన వ్యాజ్యంపై తమ వాదనలు వినకుండా కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని సీబీఐ కోరింది.

11:35 August 21

చిదంబరం ఫోన్​ స్విచ్​ ఆఫ్​.. చివరగా లోధీ రోడ్​లో..

చిదంబరం ఫోన్​ స్విచ్ ఆఫ్​. చివరగా లోధీ రోడ్​లో లొకేషన్​.

చిదంబరంపై ఈడీ లుక్​ అవుట్​ నోటీసు నేపథ్యంలో అరెస్టుపై సర్వత్రా ఉత్కంఠ

11:27 August 21

చిదంబరంపై ఈడీ లుక్​అవుట్​ నోటీసులు

చిదంబరంపై లుకౌట్‌ నోటీసులు జారీచేసిన ఈడీ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు పెండింగ్​లో చిదంబరం లీవ్​ పిటిషన్​ విచారణ

11:01 August 21

ప్రధాన న్యాయమూర్తి వద్ద పెండింగ్​లో చిదంబరం వ్యాజ్యం విచారణ

అయోధ్య కేసును విచారిస్తున్న జస్టిస్ రంజన్​ గొగోయ్ ధర్మాసనం

భోజన విరామ సమయంలో చిదంబరం పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం

10:52 August 21

ప్రధాన న్యాయముూర్తి ధర్మాసనం వద్దకు చిదంబరం న్యాయవాదులు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగోయ్​ వద్దకు చిదంబరం న్యాయవాదులు

మరోవైపు అయోధ్య కేసు విచారణ ప్రారంభించిన సుప్రీం ధర్మాసనం

10:44 August 21

సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు

చిదంబరం పిటిషన్​పై తక్షణ ఆదేశాలు ఇవ్వలేనని తేల్చిచెప్పిన జస్టిస్​ ఎన్​.వి.రమణ   

పిటిషన్​ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ ​గొగోయ్​ పరిశీలనకు పంపిస్తానని వెల్లడి

10:43 August 21

చిదంబరానికి బెయిల్​ మంజూరు చేయాలని కోరుతూ కపిల్​ సిబల్ నేతృత్వంలోని న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టులో స్పెషల్​ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్​ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపడుతోంది. కపిల్​ సిబల్, సల్మాన్ ఖుర్షీద్, వివేక్ థంఖా న్యాయస్థానానికి చేరుకున్నారు.

10:32 August 21

ఇదీ జరిగింది

ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​ను నిన్న దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ, ఈడీ అధికారులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. రెండుసార్లు చిదంబరం ఇంటికెళ్లినా ఆయన లేకపోవడం వల్ల వెనుదిరిగారు. రాత్రి సమయంలో ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. వెంటనే తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

సీబీఐ, ఈడీలు తనను అరెస్టు చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరికాసేపట్లో సుప్రీంకోర్టు ఈ బెయిల్​ పిటిషన్​ను విచారించనుంది. చిదంబరం తరపున సీనియర్ న్యాయవాది, పార్టీ సహచరుడు కపిల్ సిబల్​ నేతృత్వంలోని న్యాయవాదుల బృందం వాదనలు వినిపించనుంది.

10:16 August 21

చిదంబరం భవితవ్యం ఎటువైపు? సుప్రీంలో కాసేపట్లో వాదనలు

ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం భవితవ్యం కాసేపట్లో తేలనుంది. సీబీఐ అరెస్టు నుంచి రక్షణ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్​పై ఇవాళ ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు  విచారణ చేపట్టనుంది.

Last Updated : Sep 27, 2019, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details