తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చైనా జవాను భారత్​లో అడుగు పెట్టలేదని చెప్పగలరా?' - india china border latest news

భారత్​-చైనా సరిహద్దులో పరిస్థితిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మరోసారి డిమాండ్​ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. భారత భూభాగంలోకి ఒక్క చైనా సైనికుడు కూడా ప్రవేశించలేదని చెప్పగలరా? అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Can govt confirm that no Chinese soldiers entered India: Rahul
'చైనా సైనికుడు భారత్​లో అడుగు పెట్టలేదని చెప్పగలరా?'

By

Published : Jun 3, 2020, 1:21 PM IST

సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత భూభాగంలోకి చైనా సైనికుడు ఒక్కరు కూడా అడుగు పెట్టలేదని చెప్పగలరా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని లేవనెత్తారు.

"చైనా సైనికులెవ్వరూ భారత్​లోకి ప్రవేశించలేదని ప్రభుత్వం దయచేసి చెప్పాలి" అని ట్వీట్​ చేశారు రాహుల్. జూన్​ 6న భారత్​-చైనా ఉన్నత స్థాయి సైనిక సమావేశం నిర్వహించి సరిహద్దు సమస్యపై చర్చించనున్నారని పత్రికలో వచ్చిన వార్తను ట్వీట్​కు జతచేశారు. సరిహద్దులో చైనా భారీగా బలగాలను మోహరించిందని రక్షణ మంత్రి రాజ్​నాథ్​​ సింగ్ స్పష్టం చేశారని అందులో ఉంది.

గత నెలలో నిర్వహించిన మీడియా సమావేశాల్లోనూ చైనాతో సరిహద్దు వివాదంపై కేంద్రాన్ని తప్పుబట్టారు రాహుల్. సంక్షోభ సమయంలో కేంద్రం ఈ విషయంపై మౌనంగా ఉంటే అనిశ్చితి నెలకొంటుందన్నారు. సరిహద్దులో వాస్తవ పరిస్థితి గురించి ప్రజలకు చెప్పాలని డిమాండ్​ చేశారు. నేపాల్ విషయంలో ఏం జరిగిందో, లద్దాఖ్ సరిహద్దులో ఏం జరుగుతుందో స్పష్టత ఇవ్వాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details