తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రిటైల్​ వ్యాపారులు, దుకాణదారులకు పింఛన్​ పథకం - MODI

దేశంలోని చిరు వ్యాపారులు, దుకాణదారులు, స్వయం ఉపాధి పొందే వారి కోసం.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం ఓ కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. 60ఏళ్లు నిండిన వారికి నెలకు కనీసం రూ.3 వేల పింఛన్​ ఇచ్చే పథకానికి ఆమోదం తెలిపింది.

రిటైల్​ వ్యాపారులు, దుకాణదారులకు పింఛన్​ పథకం

By

Published : May 31, 2019, 10:49 PM IST

Updated : May 31, 2019, 11:02 PM IST

రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. తొలి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులపై వరాల జల్లు కురించటమే కాకుండా దేశంలోని రిటైల్​ వ్యాపారులు, దుకాణదారులు, స్వయం ఉపాధి పొందేవారి కోసం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఎన్నికల ప్రచార హామీల్లో భాగంగా 60 ఏళ్లు నిండిన రిటైల్​ వ్యాపారులు, చిల్లర దుకాణదారులకు నెలకు కనీసం రూ. 3 వేలు పింఛన్​ అందేలా కొత్త పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ పథకంతో దేశంలోని సుమారు 3 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.

రిటైల్​ వ్యాపారులు, దుకాణదారులకు పింఛన్​ పథకం

" ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాం. చిన్న దుకాణదారులు, రిటైల్​ వ్యాపారులు, చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వారి కోసం కొత్త పింఛన్​ పథకాన్ని ప్రారంభించాం. మూడేళ్లలో 5 కోట్ల మందిని ఈ పథకంలో చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కామన్​ సర్వీస్​ కేంద్రాల ద్వారా ఈ పథకం కోసం పేర్లను నమోదు చేసుకోవాలి. దీనికి ఒక నియమం ఉంది. 18 ఏళ్ల వారు నమోదు చేసుకుంటే రోజుకు రెండు రూపాయలు(నెలకు రూ.60) చెల్లించాలి. 29 ఏళ్లప్పుడు నమోదు చేసుకుంటే నెలకి రూ.వంద, 40 ఏళ్ల వారు నెలకి రూ. 2 వందలు చెల్లించాల్సి ఉంటుంది. చిన్న దుకాణదారులు ఎంతైతే చెల్లిస్తారో దానికి సమాన మొత్తాన్ని ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది. ఇలాంటి పింఛన్​ పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. "

-ప్రకాశ్​ జావడేకర్​, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి

అర్హులెవరు..?

జీఎస్టీ టర్నోవర్​ రూ.1.5కోట్ల లోపు ఉండి 18 నుంచి 40 ఏళ్ల లోపు వయసు వారిని ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా విస్తరించిన ఉన్న 3.25 లక్షల కామన్​ సర్వీస్​ సెంటర్లలో ఎక్కడైనా పేర్లను నమోదు చేసుకునేందుకు వీలు కల్పించారు.

Last Updated : May 31, 2019, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details