తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అబార్షన్లపై కేంద్రం కీలక నిర్ణయం- 24 వారాలకు గడువు పెంపు - కేబినెట్​ భేటీ

అబార్షన్ల చట్ట సవరణకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. అబార్షన్ చేయించుకునేందుకు ప్రస్తుతమున్న 20 వారాల గడువును 24 వారాలకు పెంచేందుకు అంగీకరించింది.

cabinet
cabinet

By

Published : Jan 29, 2020, 1:57 PM IST

Updated : Feb 28, 2020, 9:47 AM IST

అబార్షన్లకు సంబంధించి కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అబార్షన్ చేయించేందుకు ప్రస్తుతమున్న 20 వారాల గడువును 24 వారాలకు పెంచింది. 1971 నాటి గర్భవిచ్ఛిత్తి చట్టానికి ఈమేరకు సవరణలు చేస్తూ రూపొందించిన కొత్త బిల్లును దిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం గర్భం దాల్చిన 20 వారాల్లోపే అబార్షన్​ చేయించుకునే వీలుంది. ఇకపై ఆ గడువు 24 వారాలకు పెరగనుంది.

అత్యాచార బాధితులు, మైనర్లకు ఈ నిర్ణయం ఉపయోగకరంగా ఉంటుందన్నారు కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్​.

Last Updated : Feb 28, 2020, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details