అమరావతి రైతుల బాటలో అసోం నిరసనకారులు అమరావతి రైతుల బాటలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు అసోం ఆందోళనకారులు. భోగీ పండుగ రోజున ప్రభుత్వ నివేదికలను మంటల్లో కాల్చి నిరసన తెలిపారు అమరావతి రైతులు. ఇదే దారిలో అసోంలో 'భోగాలి బిహు' రోజున సీఏఏ పత్రాలను మంటల్లో వేశారు నిరసనకారులు.
అసోంలో సంక్రాంతిని మాగ్ బిహు లేదా భోగాలి బిహుగా జరుపుకొంటారు. ఆ రోజు సూర్యోదయాని కన్నా ముందే వెదురు కర్రలను కాల్చుతారు. ఈ సందర్భంగా లారస్, పితాస్ (మిఠాయిలు) పంచుకుంటారు.
ఏఏఎస్‌యూ ఆధ్వర్యంలో..
ఈ సందర్భంగా ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్‌యూ) బిహు మంటల్లో సీఏఏ పత్రాలను కాల్చాయి. రాష్ట్రంలోని అన్ని కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఏఏఎస్‌యూ.
పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించినప్పటి నుంచి అసోంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఏఏఎస్యూతో పాటు అసోం జాతియతావాది యువ ఛాత్రా పరిషత్, కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి, అసోం నాగరిక్ మంచా వంటి సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి.
ఇదీ చూడండి: బాలీవుడ్ యువ నటిని వేధించిన వ్యక్తికి మూడేళ్ల జైలు