ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడమే ఆలస్యం... అనేక మంది దేశప్రజలు వాటిని ఆచరించడం మొదలుపెట్టేస్తారు. తాజాగా.. ఇదే విషయం మరోమారు రుజువైంది. గత 'మన్‌కీ బాత్'లో విదేశీ శునకాలను వీడి.. స్వదేశీ కుక్కలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అంతే.. ఇప్పుడా ట్రెండ్ మొదలైపోయింది. ఫలితంగా కర్ణాటకలో ఉండే ముధోల జాతి శునకాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో వాటి ధరలు కూడా ఒక్కసారిగా ఎక్కువయ్యాయి. సాధారణంగా ఆడ ముధోల శునకం ధర రూ. 9వేలు, మగ కుక్క ధర రూ. 10వేలుగా ఉండేది. కానీ మోదీ మనసులో మాట అనంతరం.. వాటి ధరలు వరుసగా రూ. 18వేలు, రూ. 20వేలకు పెరిగాయి.
ఈ ముధోల జాతి శునకాలను వేట కుక్కలని కూడా పిలుస్తారు. ఒక్కసారి వేట కోసం బరిలో దిగితే.. ఇవి వేటినీ విడిచిపెట్టవు. వీటి దేహం ప్రత్యేకంగా ఉంటుంది. పొడవాటి కాళ్లు, ముఖంతో ఉండే వీటి ఆకారం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
మోదీ మెచ్చిన శునకాలు...