తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం- ఇద్దరు మృతి - మహారాష్ట్ర

మహారాష్ట్రలోని భివండీలో ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం- ఇద్దరు మృతి

By

Published : Aug 24, 2019, 10:30 AM IST

Updated : Sep 28, 2019, 2:12 AM IST

మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం

మహారాష్ట్రలో శనివారం అర్ధరాత్రి ఘోరప్రమాదం చోటుచేసుకుంది. భివండీలోని ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

"ఈ విషయంపై మాకు సమాచారం అందిన వెంటనే స్పందించాం. ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకు ఇద్దరు మృతిచెందారు. ఐదుగురు గాయపడ్డారు. ఎవరైనా గల్లంతయ్యారా? అని చుట్టుపక్కల వారిని అడిగాం. ఇప్పటివరకు అలాంటి సమాచారం అందలేదు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం చాలా తక్కువ. సహాయక చర్యలు ముమ్మరంగా సాగిస్తున్నాం.
--- పోలీసు అధికారి.

భవనం కుప్పకూలడానికి గల కారణాలు తెలిసిరాలేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

Last Updated : Sep 28, 2019, 2:12 AM IST

ABOUT THE AUTHOR

...view details