పార్లమెంటు శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లా లేదని భాజపా ఎన్నికల మేనిఫెస్టోను ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. లోక్సభ ఎన్నికల కోసం ఓటర్లకు ప్రత్యక్షంగా లంచం ఇస్తోందని ఆయన ఆరోపించారు. వాళ్ల పాలనలో ఏం చేశారో ప్రజలకు భాజపా చెప్పలేదని, ఐదేళ్ల కాలంలో తన హామీలను నెరవేర్చలేదని ఖర్గే తెలిపారు. ఇదో ఎన్నికల గిమ్మిక్కని తేల్చి పారేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలా బడ్జెట్: కాంగ్రెస్
మధ్యంతర బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోను తలపిస్తోందని ఆరోపిస్తోంది కాంగ్రెస్.
మరో నేత శశిథరూర్ మాట్లాడుతూ ఎన్నో ఆశలు రేపిన బడ్జెట్ విఫలమైందన్నారు. రైతులకు నెలకు రూ. 500 ఇస్తే ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. అయితే ఆదాయ పన్ను మినహాయింపును మాత్రం మధ్య తరగతి ప్రజలకు ఊరటను ఇస్తుందన్నారు.
"ఈ బడ్జెట్ పూర్తిగా విఫలమైంది. ఆదాయపు పన్ను మినహా పూర్తిగా నిరాశపరిచింది. రైతులకు సంవత్సరానికి రూ. ఆరు వేలు.. అంటే నెలకు రూ. 500. అవి వారికి ఎలా సరిపోతాయి. ఈ బడ్జెట్లో పనికొచ్చేది ఏదైనా ఉంటే అది ఆదాయ పన్ను మినహాయింపు మాత్రమే. ఇది మధ్య తరగతికి ఊరటనిచ్చే అంశం. "
- శశి థరూర్, కాంగ్రెస్ నేత