తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాకిస్థాన్​ కాల్పుల్లో బీఎస్​ఎఫ్​ ఎస్సై మృతి - బీఎస్ఎఫ్ ఎస్సై రాకేష్ డొబాల్

పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ సబ్ ఇన్​స్పెక్టర్​ రాకేష్ మృతి చెందినట్లు భారత ఆర్మీ పేర్కొంది.

BSF SI_Pak ceasefire
పాక్​ కాల్పుల్లో భారత జవాను మృతి

By

Published : Nov 13, 2020, 3:39 PM IST

సరిహద్దుల వెంబడి మరోసారి వక్రబుద్ధిని చాటుకుంది పాకిస్థాన్​. జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో బీఎస్​ఎఫ్ ఎస్సై రాకేష్ డోభాల్​ వీరమరణం పొందారని భారత ఆర్మీ పేర్కొంది. మరో సైనికుడికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపింది.

రాకేష్​ ఉత్తరఖాండ్​లోని రిషికేష్ ప్రాంతానికి చెందినవారని ఆర్మీ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని, బీఎస్​ఎఫ్ ఇందుకు దీటుగా స్పందిస్తోందని సీనియర్ ఆర్మీ అధికారి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'పాంగాంగ్​లో కొత్త నిర్మాణాల కూల్చివేతకు అంగీకారం'

ABOUT THE AUTHOR

...view details